Shatrughan Sinha : ప్రముఖ నటుడు, టీఎంసీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha)సంచలన కామెంట్స్ చేశారు. సిన్హా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బీజీపీలో ఉన్నారు.
ఇటీవల ఎన్నికల కంటే ముందు తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీలో చేరారు. ప్రస్తుతం లోక్ సభ ఉప ఎన్నికలలో భాగంగా టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) టికెట్ సిన్హాకు టికెట్ ఇచ్చారు.
అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బాబుల్ సుప్రియోకు దీదీ కేటాయించారు. ఈ సందర్భంగా శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ , టీఎంసీ సీనియర్ నాయకుడు , కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరేందుకు సహాయం చేశారంటూ చెప్పారు సిన్హా.
అసన్సోల్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా సిన్హాను ప్రతిపాదించింది టీఎంసీ. పీకే, సిన్హాలు తాను చేరడంలో కీలక పాత్ర పోషించారంటూ వారిని తాను జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు సిన్హా.
మమతా బెనర్జీతో కలిసి పని చేయడంతో తనకు లభించిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆమె పార్టీ తనను కోరుకుందన్నారు.
తాను పార్టీకి సేవ చేయాలని, ఎన్నికల బరిలో ఉండాలని దీదీ ఆశించారని ఆమెకు తాను రుణపడి ఉన్నానని తెలిపారు సిన్హా.
తాను సోదరుడిగా భావించే యశ్వంత్ సిన్హాతో పాటు పీకే చేసిన ఈ సాయం ఎల్లప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ఎందుకు వీడారని అన్న దానికి ఇప్పుడు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : భగవంత్ నేతృత్వం పంజాబ్ భద్రం