Yogi Cabinet : ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రెండోసారి అధికారంలోకి రానుంది. ఈ తరుణంలో రెండో సారి యోగి ఆదిత్యానాథ్ (Yogi Cabinet )కొలువు తీరనున్నారు.
ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో 317 సీట్లు చేజిక్కించుకున్న బీజేపీకి ఈసారి సీట్లు తగ్గాయి. సమాజ్ వాది పార్టీకి ఓటు బ్యాంకు పెరిగింది.
విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ 2 సీట్లకే పరిమితం కాగా బహుజన్ సమాజ్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు తో సరి పుచ్చుకుంది. దీనిపై పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. యోగి (Yogi Cabinet )వచ్చాక క్లియర్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా చేశాడు. ఆధిపత్య ధోరణితో ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చినా అవేమీ తన గెలుపుపై ప్రభావం చూపించ లేక పోయాయి.
మరో వైపు యూపీలోని లఖింపూర్ ఖేరి రైతుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక కులాలు, ప్రాంతాల వారీగా ఎవరు గెలిచారో వారికి కొలువు తీరే కొత్త కేబినెట్ లో చోటు కల్పించనున్నట్లు సమాచారం.
ఈసారి బ్రాహ్మణ, జాట్, పటేల్ వర్గాలకు మంత్రి పదవులు దక్కనున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యకు తప్పనిసరిగా ఛాన్స్ లభించవచ్చు.
ఈనెల 19 తర్వాత యోగి కేబినెట్ కొలువు తీరనున్నట్లు టాక్. మోదీతో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు సమాచారం.
Also Read : జమ్మూలో 83వ రైజింగ్ డే పరేడ్