Bhagwant Mann : పంజాబ్ ముఖ్యమంత్రిగా (Chief Minister of Punjab) కొలువు తీరిన భగవంత్ మాన్(Bhagwant Mann )సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తన ఫోటో, ప్రధాని మోదీ (Prime Minister Modi) ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండ కూడదని స్పష్టం చేశారు.
అంతే కాకుండా భారత స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన విప్లవ యోధుడు సర్దార్ షహీద్ భగత్ సింగ్ తో పాటు భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు భగవంత్ మాన్.
భగత్ సింగ్ పుట్టిన ఊరు ఖట్కర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఇవాళ విధాన సభలో కొలువుతీరారు. తన ఆఫీసులోకి వచ్చిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో అవినీతి పరుల భరతం పట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈనెల 23న యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని చెప్పారు.
దేశం కోసం బలిదానం చేసిన షహీద్ దివస్ ఫోన్ నెంబర్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు భగవంత్ మాన్(Bhagwant Mann ). రాష్ట్రంలో ఎవరైనా లంచం అడిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఫోన్ నెంబర్ ను ప్రజలకు అందుబాటు లోకి తీసుకు వస్తామన్నారు. పంజాబ్ ప్రజలు అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను వాట్సాప్ నెంబర్ కు పంపించాలని తెలిపారు.
వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసి తనకు పంపాలని సూచించారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు భగవంత్ మాన్. పంజాబ్ లో ఇక లంచం అన్న మాట అనే పదం వినిపించదన్నారు.
Also Read : చేప ఉండాల్సింది జలంలో… నేత ఉండాల్సింది జనంలో…