Sonia Gandhi : దేశంలోని తాజాగా ఐదు రాష్ట్రాలలో ఘోరమైన ఓటమి మూటగట్టుకుంది కాంగ్రెస పార్టీ. ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ.
ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. గాంధీ కుటుంబం నాయకత్వం నుంచి తప్పుకోవాలంటూ ఓ వర్గం డిమాండ్ చేసింది. జీ-23 పేరుతో నిర్వహిస్తున్న సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ నేతృత్వం వహిస్తున్నారు.
ఈ తరుణంలో కళ్లు తెరిచిన సోనియా గాంధీ(Sonia Gandhi) దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల చీఫ్ లు తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించింది.
ఎన్నికలు జరిగే కొద్ది రోజుల కంటే ముందు పీసీసీ చీఫ్ గా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ తరుణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సోనియా గాంధీ(Sonia Gandhi).
ఆయా రాష్ట్రాలలో పార్టీ ఎందుకు ఓడి పోయిందనే దానిపై విశ్లేషించి పూర్తి నివేదిక తనకు అందజేయాలని ఆదేశించారు. ఆయా రాష్ట్రాలకు పరిశీలకులను నియమించారు.
గోవా, మణిపూర్ రాష్ట్రాలలో పార్టీ ఓటమి పొందడంపై విశ్లేషించేందుకు జైరామ్ రమేష్ , పంజాబ్ కు అజయ్ మాకెన్ ను నియమించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు కాంగ్రెస్ సీనియర్ జితేంద్ర సింగ్ కు అప్పగించగా ఉత్తరాఖండ్ కు అవినాష్ పాండేను ఎంపిక చేశారు సోనియా గాంధీ.
Also Read : లంచం అడిగితే వాట్సప్ చేయండి