Congress G23 : కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తూ ధిక్కార స్వరం వినిపిస్తున్న జీ-23(Congress G23) నేతలు మరోసారి ఇవాళ గులాం నబీ ఆజాద్ నివాసంలో సమావేశం అయ్యారు. వీరు సమావేశం కావడం ఇది రెండో సారి.
ఈ సమావేశానికి హాజరైన వారిలో సీనియర్ నాయకులు కపిల్ సిబల్ , భూపీందర్ సింగ్ హూడా, ఆనంద్ శర్మ, శశి థరూర్ ఉన్నారు. అంతకు ముందు హూడా రాహుల్ గాంధీని కలిశారు.
ఇటీవల ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింది. ప్రధానంగా నాయకత్వంలో మార్పు రావాల్సి ఉందని డిమాండ్ చేశారు.
గతంలో జీ-23 పేరుతో వ్యతిరేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూసీ మీటింగ్(Congress G23) ముగిశాక గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసింది. వారిపై మాటల దాడులు ప్రారంభించింది.
దీంతో సోనియా గాంధీ ఫ్యామిలీకి విధేయులుగా ఓ వర్గం తయారైతే మరికొందరు వ్యతిరేకంగా మారారు. ఉమ్మడి ప్రకటన చేశారు ఆజాద్ టీం సభ్యులు.
సమిష్టి నిర్ణయం తీసుకోవాలని, అందరినీ కలుపుకుని పోవాలని, భావ సారుప్యత కలిగిన పార్టీలు, వ్యక్తులు, సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
పూర్తిగా గాంధీ ఫ్యామిలీ వెంటనే పదవులను త్యాగం చేయాలని డిమాండ్ చేశారు. 18 మంది సీనియర్ నాయకులతో కూడిన సంతకాలతో ఓ లేఖను కూడా విడుదల చేయడం సంచలనం కలిగించింది.
ఆజాద్ నేతృత్వంలోని నాయకులపై నిప్పులు చెరిగారు మల్లికార్జున్ ఖర్గే, మాణిక్యం ఠాగూర్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీనే కొనసాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన నేఫథ్యంలో ఈ సమావేశం జరగడం విశేషం.
ఆజాద్ త్వరలో సోనియా గాంధీని కలవనున్నట్లు సమాచారం.
Also Read : ‘పీకే..సిన్హా’ సాయం మరిచి పోలేను