TTD : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది. వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబఃధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 20న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.
భక్తులు తిరుపతిబాలాజీ.ఏపీ.గవ్.ఇన్ అనే వెబ్ సైట్ ను క్లిక్ చేసి బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ(TTD). ఇందులో భాగంగా తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో ఎలక్ట్రిక్ డిప్ పద్దతిన కేటాయించనున్నట్లు తెలిపింది.
ఈ సేవలకు సంబంధించి ఈనెల 20 ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల లోపు నమోదు చేసుకోవాలని సూచించింది.
టికెట్లు పొందిన వారి జాబితాను మార్చి 22 తర్వాత అధికారిక టీటీడీ(TTD వెబ్ సైట్ లో పొందుపరుస్తామని వెల్లడించింది. కాగా టికెట్లు లభించిన భక్తులు రెండు రోజుల లోపు టీటీడీకి వాటి ధర చెల్లించాలని స్పష్టం చేసింది.
ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను భక్తులు నేరుగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది టీటీడీ.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 2న ఉగాది పండుగ సందర్భంగా స్వామి వారికి నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం లేదని పేర్కొంది.
10న జరిగే శ్రీరామనవమి సందర్భంగా తోమాల, అర్చన, సహస్ర దీపాలంకార సేవను కూడా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
ఏప్రిల్ లో 14 నుంచి 16 వరకు జరిగే సేవలతో పాటు మే 10 నుంచి 12 వరకు జరిగే సేవలు, జూన్ 14న జరిగే సేవలను నిలిపి వేసినట్లు పేర్కొంది.
ఇక శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తీసుకు రావాలని సూచించింది.
Also Read : హొలీ మృత్యుకేళి కాకూడదు