Ro Khanna : అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎంపికయ్యాక ప్రవాస భారతీయులకు ప్రయారిటీ లభిస్తోంది. వైట్ హౌస్ తో పాటు పలు ప్రధాన పోస్టులలో ఎన్నారైలు కొలువు తీరారు.
70 శాతానికి పైగా మన వారే ఉండడం విశేషం. ఇక ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస సైతం ప్రవాస భారతీయురాలు కావడం విశేషం. తాజాగా భారతీయ , అమెరికన్ రో ఖన్నా (Ro Khanna)ఎమర్జింగ్ బయోటెట్ లో బైడెన్ టాప్ టీంలో ఎంపికయ్యారు.
నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2022 ప్రకారం 12 మంది సభ్యులతో కూడిన నేషనల్ సెక్యూరిటీ కమిషన్ ఆన్ ఎమర్జింగ్ బయో టెక్నాలజీని ఏర్పాటు చేశారు.
ఈ టీంలో కాంగ్రెస్ సభ్యుడైన రో ఖన్నాను ఆడమ్ స్మిత్ కమిటీకి ఎంపిక చేసినట్లు అమెరికా ప్రకటించంది. ఈ మేరకు అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ జాతీయ భద్రతా కమిషన్ ఆన్ ఎమర్జింగ్ బయో టెక్నాలజీ , అభివృద్ధి చెందుతున్న బయో టెక్నాలజీ, సంబంధిత సాంకేతికతల పురోగతి, రక్షణ శాఖ ప్రస్తుత, భవిష్యత్తు కార్యకలాపాలను ఎలా రూపొందిస్తాయనే దానిపై సమగ్ర సమీక్షను నిర్వహిస్తుంది.
యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ , ఆర్మ్ డ్ సర్వీసెస్ కమిటీలకు ఒక ఏడాది లోపు మధ్యంతర నివేదికను ఈ కమిటీ అందిస్తుంది. రెండు సంవత్సరాలలో పూర్తి నివేదికను అందజేయాల్సి ఉంటుంది 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ.
రో ఖన్నా కాలిఫోర్నియా 17వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుననారు. మూడోసారి ఈ పదవిలో ఉన్నారు. రో ఖన్నా ఇప్పటికే పలు పదవుల్లో కొనసాగుతున్నారు.
అపారమైన అనుభవం కలిగిన రో ఖన్నాకు పదవి దక్కడం పట్ల ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రష్యాకు అంతర్జాతీయ కోర్టు షాక్