Oksana Shvets : రష్యా దారుణ మారణ కాండకు ఉక్రెయిన్ జనం పిట్టల్లా రాలి పోతున్నారు. ఇప్పటికే వేల మందికి పైగా తమ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ నటి ఒక్సానా ష్వెట్స్ (Oksana Shvets)రష్యా జరిపిన రాకెట్ దాడిలో దుర్మరణం చెందారు.
ఆ దేశ రాజధాని కైవ్ పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. నగరంలోని కేపిటల్ సిటీ నివాస భవనంపై రాకెట్ దాడి జరిగింది. ఆ నివాస భవనంలో ఉన్న ఒక్సానా ష్వెట్స్ మరణించారు.
అత్యుత్తమమైన కళాత్మక, ప్రతిభా నైపుణ్యం కలిగిన నటిగా ఒక్సానా ష్వెట్స్(Oksana Shvets) గుర్తింపు పొందారు. ఆమె మరణాన్ని ధ్రువీకరించింది యంగ్ థియేటర్ టీం. కైవ్ లోని నివాస భవనంపై రాకెట్ దాడి చోటు చేసుకుంది.
ఈ ఘటనలో తమ దేశం గర్వించ దగిన నటి ప్రాణాలు కోల్పోయారని విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఒక్సానా వయసు 67 ఏళ్లు. ఆమె దేశం గర్వించ దగిన కళాకారిణిగా గుర్తింపు పొందింది.
అంతే కాదు ఉక్రెయిన్ ప్రభుత్వం గౌరవనీయ కళాకారణి ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదుతో సత్కరించింది. ఇదిలా ఉండగా ఏకపక్షంగా సాగిస్తున్న దాడుల పరంపరను నిలిపి వేయాలని అంతర్జాతీయ కోర్టు ఇప్పటికే రష్యాను ఆదేశించింది.
మరో వైపు ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ , తదితర దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినా తగ్గడం లేదు. యావత్ ప్రపంచం మూకుమ్మడిగా కోరినా పట్టించు కోవడం లేదు రష్యా చీఫ్ పుతిన్.
ఉక్రెయిన్ తగ్గేంత దాకా తమ దాడులు ఆపబోమంటూ ప్రకటించారు. కాగా సాధారణ పౌరులు, అమాయకులు ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరం.
Also Read : ముమ్మాటికీ యుద్ద నేరస్థుడే