Suvendu Adhikari : మొన్నటి దాకా టీఎంసీ లో ఉంటూ సీఎం అవుదామని ఆశ పడి చివరకు దీదీ కొట్టిన దెబ్బకు భంగపడిన బీజేపీ నాయకుడు సువేందు అధికారి తీరు వివాదాస్పదంగా మారింది.
ఆయన ప్రవర్తన రోజు రోజుకు ఇబ్బందులు కలుగ చేస్తోంది. ఈ తరుణంలో సాక్షాత్తు చట్టసభ సాక్షిగా రెబల్ ఎమ్మెల్యేలపై నోరు పారేసు కోవడం సంచలనం కలిగించింది. తమ పార్టీకి చెందిన వారు ఇటీవల ఆ పార్టీని వీడారు.
సభా సాక్షిగా మీపై ఐటీ దాడులు చేయిస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో బీజేపీ నుంచి జంప్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దీంతో తమను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ సువేందు అధికారిపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకునేలా సభా హక్కుల ఉల్లంఘనకు ఆమోదించింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో సువేందు అధికారి పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ నుంచి బయటకు వచ్చిన నలుగురు శాసనసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కోపంతో ఊగి పోయారు సువేందు అధికారి(Suvendu Adhikari). సభ నుంచి వాకౌట్ చేశారు.
వెళుతూ వెళుతూ ఆ నలుగురిపై కన్నెర్ర చేశారు. అంతే కాదు ఇక కాస్కోండి మా సర్కార్ కేంద్రంలో ఉంది. ఇక మీకు చుక్కలు చూపిస్తా. ఐటీ దాడులు చేయిస్తానంటూ నిప్పులు చెరిగారు.
దీంతో తమను బెదిరింపులకు గురి చేసిన స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
Also Read : ఆజాద్ తో మరోసారి సీనియర్ల భేటీ