Abhishek Banerjee : ‘అభిషేక్..రుజిరా’ బెన‌ర్జీల‌కు స‌మ‌న్లు

21న హాజ‌రు కావాల‌ని ఈడీ ఆదేశం

Abhishek Banerjee : కేంద్ర స‌ర్కార్ ఆధీనంలోని ద‌ర్యాప్తు సంస్థ‌లు జూలు విదులుస్తున్నాయి. ఇప్ప‌టికే బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు, సంస్థ‌లు, నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇక ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడి పోయింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఈ త‌రుణంలో నువ్వా నేనా రీతిలో మారాయి బెంగాల్ రాజ‌కీయాలు.

ఇక అధికారంలో మ‌రోసారి వ‌చ్చిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు ఎంపీ అభిషేక్ బెన‌ర్జీతో(Abhishek Banerjee) పాటు ఆయ‌న భార్య రుజిరా బెన‌ర్జీల‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ – ఈడీ మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది.

ఇప్ప‌టికే ఒక‌సారి రావాలంటూ స‌మ‌న్లు జారీ చేసింది. ఈడీ , స‌ర్కార్ తీరుపై దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ(Abhishek Banerjee) ఆరోపించారు. కావాల‌ని క‌క్ష‌గ‌ట్టి వేధింపుల‌కు గురి చేస్తోంద‌ని కానీ భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేదంటూ హెచ్చ‌రించారు.

ఈ త‌రుణంలో తాజాగా మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌స్తుతం ఈడీ వ్య‌వ‌హారం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఈనెల 21న ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది.

జారీ చేసిన స‌మ‌న్ల‌లో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా 21న ఎంపీ అభిషేక్ బెన‌ర్జీని, 22న రుజిరా బెన‌ర్జీని రావాల‌ని స్ప‌ష్టం చేసింది. కాగా గ‌త ఏడాది 2021న సెప్టెంబ‌ర్ 10న ఈడీ వీరిద్ద‌రికీ నోటీసులు జార చేసింది.

కాగా ఢిల్లీలో ఆఫీస‌ర్ల ముందు తాము హాజ‌రు కాలేమంటూ వీరు హైకోర్టును ఆశ్ర‌యించారు. అభిషేక్, రుజిరా దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను ఢిల్లీ హైకోర్టు ఈనెల 11న కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. దీంతో మేల్కొన్న ఈడీ మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది.

Also Read : ఐదు రాష్ట్రాల‌కు సీనియ‌ర్ల నియామ‌కం

Leave A Reply

Your Email Id will not be published!