Finland : వ‌ర‌ల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్ లాండ్

వ‌రుస‌గా ఐదోసారి టాప్ లో నిలిచిన దేశం

Finland  : ప్ర‌పంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన దేశంగా ఫిన్ లాండ్(Finland )ఎంపికైంది. ఇక జాబితాలో ఆఖ‌రున నిలిచింది ఆఫ్గ‌నిస్తాన్. ఆ దేశం అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతంగా నిలిచింది.

ప్ర‌తి ఏటా సంతోష‌క‌ర‌మైన దేశాల ఎంపిక జ‌రుగ‌తుంది. ఫిన్ లాండ్ వ‌రుస‌గా టాప్ లో నిల‌వ‌డం ఇది వ‌రుస‌గా ఐదోసారి కావ‌డం విశేషం. వ‌ర‌ల్డ్ హ్యాపినెస్ నివేదిక‌లో ఆ దేశం మొద‌టి స్థానంలో నిలిచింది.

సున్నా నుంచి 10 స్కేల్ కేటాయించింది. ఇందులో పాయింట్ల ఆధారంగా ఆయా దేశాల‌కు ర్యాంకులు ఇచ్చింది. వార్షిక యూఎన్ ప్రాయోజిత సూచిక‌లో ఆఫ్గ‌నిస్తాన్ తిరిగి అసంతృప్తికి, అల‌జడుల‌కు కేరాఫ్ గా నిలిచింది.

దాని త‌ర్వాత లెబ‌నాన్ దేశం నిలిచింది. సెర్బియా, బ‌ల్గేరియా, రొమేనియా కూడా ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న లెబ‌నాన్ 146 దేశాల సూచిక‌లో జింబాబ్వే కంటే కొంచెం దిగువ‌న నిలిచింది.

నిన్న‌టి దాకా తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లిన తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన ఆఫ్గ‌నిస్తాన్ చివ‌ర‌కు చేరుకుంది. మాన‌వ‌తా విలువలకు ఇబ్బంది ఏర్ప‌డింది.

వ‌ర‌ల్డ్ హ్యాపియెస్ట్ నివేదిక‌ను ఆయా దేశాల్లో ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు, ఆనందం, సంతోషం, ఆర్థిక ప‌రిస్థితి, సామాజిక డేటా ఆధారంగా రూపొందించారు ఈ నివేదిక‌ను.

మూడు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో స‌గ‌టు డేటా ఆధారంగా సున్నా నుంచి 10 వ‌ర‌కు స్కోరును కేటాయిస్తుంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడికి ముందు దీనిని రూపొందించారు.

ఇక ఫిన్ లాండ్ (Finland )త‌ర్వాత రెండో స్థానంలో డేన్స్ , ఐస్లాండిక్, స్విస్ , డ‌చ్ త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. సామాజిక మ‌ద్ద‌తు, దాతృత్వాన్ని చాట‌డం, నిజాయ‌తీతో ఉండ‌డం, ఆప‌ద‌లో ఆదుకోవ‌డం అని పేర్కొంది నివేదిక‌.

Also Read : బైడెన్ వార్నింగ్ పుతిన్ డోంట్ కేర్

Leave A Reply

Your Email Id will not be published!