Imran Khan : పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ – పీఎంఎల్ఎన్ , పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ – పీపీపీ కి చెందిన దాదాపు 100 మంది శాసనసభ్యులు ఈనెల 8న నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని తీర్మానం చేశారు.
దీంతో తీవ్ర చిక్కుల్లో పడ్డారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ గా ప్రపంచ కప్ తీసుకు వచ్చిన ఈ స్టార్ మాజీ ప్లేయర్ కు దేశాన్ని నడపడం చాలా ఇబ్బందిగా మారింది.
విచిత్రం ఏమిటంటే తన స్వంత పార్టీకి చెందిన శాసనసభ్యులు కొందరు ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. పాక్ ప్రధాని అవిశ్వాసానికి ముందు ఈ వ్యతిరేకత ఎదుర్కోవడం ఇప్పుడు పాకిస్తాన్ లో కలకలం రేపింది.
ఇమ్రాన్ ఖాన్ నుంచి విడి పోయేందుకు 24 మంది శాసనసభ్యులు సిద్దంగా ఉన్నారు. దీంతో అటు విపక్షం ఇటు స్వపక్షం నుంచి దాడులు మొదలు కావడంతో పాలుపోని స్థితిలో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
ఇప్పటికే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తీవ్రవాదం, నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారింది పాకిస్తాన్ కు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇమ్రాన్ ఖాన్.
తాను అప్పులు చేయలేదని గతంలో ఏలిన పాలకులు చేసిన పాపమే ఇదని ఆరోపిస్తున్నారు. కాని ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు.
స్వంత పార్టీకి చెందిన అసంతృప్త అభ్యర్థులు ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బెదిరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : శాంతి బహుమతి రేసులో జెలెన్ స్కీ