Omar Abdullah : క‌నిపించ‌ని సిక్కులు..ముస్లింల త్యాగం

ది క‌శ్మీర్ ఫైల్స్ మూవీపై ఒమ‌ర్ అబ్దుల్లా

Omar Abdullah : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తూ దూసుకు పోతోంది వివేక్ అగ్నిహొత్రి తీసిన చిత్రం ది క‌శ్మీర్ ఫైల్స్ . ఈ చిత్రంపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి దేశ వ్యాప్తంగా. ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ దీనిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

తాజాగా నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నాయ‌కుడు ఒమ‌ర్ అబ్దుల్లా (Omar Abdullah)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక వ‌ర్గాన్ని హైలెట్ చేస్తూ మూవీ తీశారంటూ ఆరోపించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు, సిక్కులు చేసిన త్యాగాలు గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నించారు.

కాశ్మీరీ హిందువుల వ‌ల‌స‌లు క‌శ్వీరియ‌త్ పై మ‌చ్చ అని ఆ స‌మ‌యంలో మిగ‌తా వ‌ర్గాలు సైతం న‌ష్ట పోయాయ‌ని, వారి త్యాగాలను ఎందుకు ప్ర‌స్తావించ లేక పోయార‌ని నిల‌దీశారు.

ది క‌శ్మీర్ ఫైల్స్ స‌త్య దూరంగా ఉంద‌న్నారు ఒమ‌ర్ అబ్దుల్లా(Omar Abdullah). 1990లో ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ట‌న‌ల్ని తోసి పుచ్చ‌లేమంటూనే మిగ‌తా వారిని ప‌క్క‌న పెడితే ఎలా అని వాపోయారు.

కాశ్మీరీ పండిట్లు త‌మ భ‌ద్ర‌తా భావాన్ని విడిచి పెట్ట‌డం, లోయ‌ను విడిచి వెళ్ల వ‌ల‌సి రావ‌డం మ‌న సంస్కృతికి మాయ‌న మ‌చ్చ‌గా పేర్కొన్నారు.

వివేక్ అగ్నిహోత్రి తీసిన ది క‌శ్మీర్ ఫైల్స్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదం కార‌ణంగా 1980 చివ‌ర‌లో, 1990 ప్రారంభంలో కాశ్మీర్ కు చెందిన హిందువులు ప్ర‌ధానంగా పండిట్ లు పెద్ద ఎత్తున వ‌ల‌స వెళ్లారు.

దీనినే ప్ర‌ధాన క‌థాంశంగా తీశారు ద‌ర్శ‌కుడు. ఈనెల 11న విడుద‌లైన ఈ సినిమాకు జ‌నం జేజేలు ప‌లుకుతున్నారు. ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా అభినందించారు.

ప్ర‌తి భార‌తీయుడు, హిందువులు చూడాల‌ని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ది క‌శ్మీర్ ఫైల్స్ కు వినోద ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చాయి.

Also Read : ఎఫ్ 3 మూవీ స‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!