Punjab Cabinet : పంజాబ్ లో కొలువుతీరిన కేబినెట్

మంత్రులుగా 10 మందికి ఛాన్స్

Punjab Cabinet : పంజాబ్ లో అఖండ విజ‌యాన్ని న‌మోదు చేసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. గ‌తంలో పాలించిన పాల‌కుల‌కు భిన్నంగా త‌న‌దైన ముద్ర వేస్తున్నారు పంజాబ్ సీఎంగా కొలువు తీరిన భ‌గ‌వంత్ మాన్.

17 మంది కేబినెట్ లో ఉండే వారు. కానీ సంప్ర‌దాయినికి చెక్ పెట్టారు. కేవ‌లం గెలిచిన 92 మంది ఎమ్మెల్యేల‌లో 10 మందికి మాత్ర‌మే మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు భ‌గ‌వంత్ మాన్.

ఇప్ప‌టికే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. త‌న ఫోటో కానీ ప్ర‌ధాని మోదీ ఫోటో కానీ ఆఫీసుల్లో ఉండ కూడ‌ద‌ని ఆదేశించారు. వాటి స్థానంలో స‌ర్దార్ ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ (Punjab Cabinet), బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ఫోటోలు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన 122 మంది ఎమ్మెల్యేల భ‌ద్ర‌త‌ను తొల‌గించాల‌ని డీజీపీని ఆదేశించారు. త‌న వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శిగా తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ను అపాయింట్ చేశారు.

ఇక రాష్ట్రంలో ఎవ‌రైనా లంచం అడిగితే వెంట‌నే త‌న‌కు ఫోన్ చేయాల‌ని లేదా వాట్సాప్ ద్వారా వీడ‌యో, మెస్సేజ్ పెట్టాల‌ని ప్ర‌క‌టించారు. ఈనెల 23న భ‌గ‌త్ సింగ్ వ‌ర్దంతి రోజున ప్రారంభిస్తాన‌ని చెప్పారు.

తాజాగా హ‌ర్యానా, పంజాబ్ గ‌వ‌ర్న‌ర్లు ద‌త్తాత్రేయ‌, భ‌న్వ‌రీలాల్ స‌మ‌క్షంలో 10 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు ఇవాళ‌. విధాన స‌భ‌లో వీరంతా కొలువుతీరారు.

కేబినెట్ లో కొలువుతీరిన వారిలో చీమా, బ‌ల్జిత్ కౌర్ , హ‌ర్భ‌జ‌న్ సింగ్ , విజ‌య్ సింగ్లా, లాల్ చంద్ , గుర్మీత్ సింగ్ హ‌య‌ర్ ఉన్నారు. ధాలివాల్ , ల‌ల్జిత్ సింగ్ భుల్ల‌ర్ , జింపా, హ‌ర్జోత్ సింగ్ బైన్స్.

Also Read : మారిన స్వ‌రం ‘మేడం’ స‌మ్మ‌తం

Leave A Reply

Your Email Id will not be published!