Imran Khan : ఇమ్రాన్ ఖాన్ పై కోర్టు క‌న్నెర్ర‌

మీ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేదు

Imran Khan : ఈ ఏడాది పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు అంత‌గా అచ్చొచ్చిన‌ట్లు లేదు. ఇప్ప‌టికే ఆయ‌న అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నారు.

ఈ త‌రుణంలో పాకిస్తాన్ కోర్టు సీరియ‌స్ అయ్యింది. మీ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేదంటూ మండిప‌డింది. మీరు క‌మిష‌న్ ముందు హాజ‌రు కాకుండా ఉండి పోయారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారం కింద‌కు వ‌స్తుంద‌టూ స్ప‌ష్టం చేసింది.

ఈనెల 11న లోయ‌ర్ దిర్ లో జ‌రిగిన ర్యాలీలో పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేదంటూ ఇస్లామాద్ హైకోర్టు పేర్కొంది. పాకిస్తాన్ ఎన్నిక‌ల సంఘం నోటీసును స‌స్పెండ్ చేయాలంటూ ప్ర‌ణాళిక‌, అభివృద్ధి మంత్రి అస‌ద్ ఉమ‌ర్ చేసిన విన్న‌పాన్ని తిర‌స్క‌రించింది.

ఈనెల 14న ఇసీపీ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)మీరు పీఎం స్థాయికి త‌గ్గ‌ట్టు వ్య‌వ‌హ‌రంచ లేద‌ని అర్థ‌మైంది.

స‌వ‌రించిన ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి, ఎన్నిక‌ల చ‌ట్టం 2017 , దాని కింద రూపొందించిన రూల్స్ ఉల్లంఘిచార‌ని నిర్ధారించేందుకు త‌గిన సాక్ష్యం త‌మ వ‌ద్ద అందుబాటులో ఉంద‌ని కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఇదిలా ఉండ‌గా ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌సంగం చేశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను తూల‌నాడారు. వారిని అన‌రాని మాట‌లు అన్నారు. మ‌నుషులు వాడ‌ని భాష‌ను ఆయ‌న ప్ర‌యోగించారు.

అవిశ్వా స తీర్మానం ఓడి పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించాడు ఖాన్. త‌న‌పై అవిశ్వాసానికి నేతృత్వం వ‌హిస్తున్న ముగ్గురు నేత‌లు మౌలానా రెహ్మాన్, ఆసిఫ్ జ‌ర్దారీ, షెహ‌బాజ్ ష‌రీఫ్ ల‌పై మండిప‌డ్డారు.

Also Read : ఇబ్బందుల్లో ఇమ్రాన్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!