Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో సెంట్రల్ రిజర్వు ప్రొటెక్షన్ ఫోర్స్ – సీఆర్పీఎఫ్ అందిస్తున్న సేవలు అత్యద్భుతం అంటూ కొనియాడారు.
పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర బలగాలు నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో స్థానిక పరిపాలన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు.
కొన్ని సంవత్సరాలలో జమ్మూ కాశ్మీర్ , ఈశాన్య ప్రాంతంలో ఇక పై బలగాలు, దళాల అవసరం ఉండదన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వం కాశ్మీర్ లో భారీ భద్రతా మోహరింపును తొలగించాలని విస్తృతంగా సూచించిందన్నారు.
కొన్ని ఏళ్లలో దాన్ని సాధించేందుకు టైమ్ లైన్ ను నిర్దేశించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు అమిత్ షా(Amit Shah ). కశ్మీర్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్యా ప్రాంతాలలో సీఆర్పీఎఫ్ సంకల్పంతో పని చేసింది.
త్వరలో వాటి ఉపయోగం కూడా ఉండదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. మూడు ప్రాంతాలలో పూర్తి శాంతిని కొనసాగించవచ్చని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం సీఆర్పీఎఫ్ కే (Amit Shah )దక్కుతుందన్నారు.
ఇవాళ శ్రీనగనర్ లోని మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన సీఆర్పీఎఫ్ 83వ రైజింగ్ డే పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
370 రద్దు తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదంపై నిర్ణయాత్మక నియంత్రణను కలిగి ఉండటమే అతి పెద్ద విజయమని తాను నమ్ముతున్నట్లు అమిత్ షా చెప్పారు.
Also Read : ద్రవ్యోల్బణం దేశానికి ప్రమాదం