KCR : ముగిసిన స‌మావేశం మోదీపై యుద్ధం

ఫ్ల‌వర్ కాదు ఫైర్ అంటున్న కేసీఆర్

KCR  : ఫ్ల‌వ‌ర్ కాదు ఫైర్ అంటున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌజ్ లో అత్య‌వ‌స‌ర స‌మావేశం చేప‌ట్టారు. మంత్రులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు టాక్. కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈనెల 21 నుంచి ఉద‌యం 11.30 గంట‌ల‌కు టీఆర్ఎస్ పార్టీ శాస‌నస‌భ ప‌క్ష స‌మావేశం జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు.

ఈ మీటంగ్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, జిల్లా అధ్య‌క్షులు, జెడ్పీ చైర్మ‌న్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ల చీఫ్ లు, రైతు బంధు స‌మితుల జిల్లా అధ్య‌క్షులు విధిగా హాజ‌రు కావాల‌ని సీఎం(KCR )ఆదేశించారు.

ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రోసారి స‌త్తా చాటింది. ఈ త‌రుణంలో మోదీపై యుద్దానికి సిద్దం అయ్యారు. ఎక్క‌డా త‌గ్గేదే లేదంటూ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో యాసంగి వ‌రి ధాన్యాన్ని కేంద్ర స‌ర్కార్ త‌ప్ప‌నిస‌రిగా కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు, నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు.

సీఎం, మంత్రుల బృందం స‌మావేశం ముగిసిన వెంట‌నే ఢిల్లీకి వెళ‌తారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రుల్ని, ప్ర‌ధాని మోదీని క‌లుస్తారు.

తెలంగాణ‌లో జ‌రిగే ఆందోళ‌ల‌తో పాటు పార్ల‌మెంట్ లోని లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో సైతం ఎంపీలు నిర‌స‌న తెలిపేలా దిశా నిర్దేశం చేయ‌నున్నారు కేసీఆర్(KCR ).

ఇందులో భాగంగా వ‌రి ధాన్యాన్ని 100 శాతం ఎఫ్‌సీఐ సేక‌రించాల‌ని డిమాండ్ చేయ‌నున్నారు. రైతుల‌కు ఎక్క‌డా లేని రీతిలో రైతు బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు.

Also Read : మా పోరాటం దిగొచ్చిన ప్ర‌భుత్వం

Leave A Reply

Your Email Id will not be published!