Bhagwant Mann : పంజాబ్ సీఎంగా కొలువు తీరిన భగవంత్ మాన్ (Bhagwant Mann )సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ 10 మంత్రులతో కేబినెట్ కొలువుతీరింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రివర్గంతో భేటీ అయ్యారు భగవంత్ మాన్.
ఈ సందర్బంగా తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న 25 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో 10 వేల జాబ్స్ పోలీస్ శాఖలో మిగతా 15 వల జాబ్స్ ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగార్థులు, నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా తాము ప్రకటించిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇవాళ ప్రకటించారు.
మొదటి సమావేశంలో కొత్త మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న విధాన సభ సమావేశంలో మూడు నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ సమర్పించాలని నిర్ణయించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలకు అవసరమైన సప్లిమెంటరీ గ్రాంట్లు కూడా ఈనెల 22న ముగిసే సెషన్ లో పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann ).
ఇందులో భాగంగా వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు సీఎం. ఈ సందర్భంగా ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు, నోటిఫికేషన్ల ప్రక్రియను నెల రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు సీఎం. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : భేటీ అబద్దం కలిసే పోటీ చేస్తాం