Shankha Brata Bagchi : ఉక్రెయిన్, రష్యా యుద్దాన్ని బూచి చూపించి వ్యాపారులు, సంస్థలు భారీ ఎత్తున ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు వంట నూనెల్ని అమ్ముతున్నాయి.
దీంతో ఏపీ సర్కార్ దీనిని సీరియస్ గా పరిగణించింది. సీఎం జగన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా ఒక్క రూపాయికి ఎక్కువ అమ్మినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వంట నూనెలను ఎంఆర్పీ కంటే ఒక్క పైసా ఎక్కువకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏపీ విలిజెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి(Shankha Brata Bagchi).
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించ బోమన్నారు. యుద్దం పేరుతో కొందరు సరుకును తమ వద్ద ఉంచుకుని ఎక్కువ ధరకు వంట నూనెలను అమ్ముతున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం దీని విషయంలో సీరియస్ గా ఉందన్నారు. వంట నూనెల్ని ఎక్కడైనా అమ్మినా తమ సిబ్బంది దాడులు చేస్తారని హెచ్చరించారు. నిరంతరం విజిలెన్స్ దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు.
ఇదిలా ఉండగా పాత స్టాకు విషయంలో రూల్స్ కు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బాగ్చి. అక్రమాలకు పాల్పడితే బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు.
బ్లాక్ మార్కెటింగగ్ అక్రమాలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. ప్రజలు, వినియోగదారులు వెంటనే తాను కింద ఇచ్చిన 94440906254 అనే ఫోన్ నెంబర్ కు చేయాలని సూచించారు. ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామన్నారు.
Also Read : మమత వ్యాఖ్యలపై టిడిపి సమాధానం