Uddhav Thackeray : శివసేన పార్టీ చీఫ్, మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన కామెంట్స్ చేశారు. శివసేన ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకుంటోందంటూ కావాలని బద్నాం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తమది పూర్తిగా హిందూత్వ పార్టీ అని స్పష్టం చేశారు. భావ సారూప్యత కలిగిన వారితోనే తమ ప్రయాణం ఉంటుందని అన్నారు.
కావాలని తమను ప్రజల్లో వ్యతిరేక భావం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని దీనిని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకోబోమంటూ హెచ్చరించారు.
ఆదివారం సీఎం శివసేన పార్టీకి చెందిన శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మరో వైపు ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంపై ఫైర్ అయ్యారు.
భారతీయ జనతా పార్టీకి బీ టీం అంటూ మండిపడ్డారు. ఔరంగాజేబు సమాధి వద్ద మొక్కే వారితో తాము ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. ఇలాంటి విషపు ప్రచారాన్ని నమ్మవద్దంటూ కోరారు.
బీజేపీ హిందూత్వను కేవలం రాజకీయం కోసమే వాడుకుంటోందంటూ ఆరోపించారు ఠాక్రే(Uddhav Thackeray). ఇదంతా బీజేపీ ఆడుతున్న గేమ్ ప్లాన్ గా మండిపడ్డారు. ఇందుకు సంబంధించి శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సైతం స్పందించారు.
సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీపై, మోదీపై నిప్పులు చెరిగారు. సంకీర్ణ ప్రభుత్వంలోకి తీసుకోబోమంటూ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఓ రోగమని అంటుకుంటే ప్రమాదమని కామెంట్ చేశారు.
శివసేన ఛత్రపతి మహరాజ్ శివాజీ స్పూర్తితోనే రాజకీయాలు చేస్తుందని అన్నారు. బీజేపీ కుట్రల్ని త్వరలోనే నిగ్గు తేలుస్తామన్నారుశివసేన ఎంపీ సంజయ్ రౌత్.
Also Read : మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్