KCR Prashant Kishor : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరొందిన ప్రశాంత్ కిషోర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాజాప్తాగా పీకేతో కలిసి పని చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.
ఇవాళ సీఎం కేసీఆర్(KCR Prashant Kishor )మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పారు. గెలుపు ఓటములను తాను పట్టించు కోనని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ ల దాడులకు తాను భయపడనని చెప్పారు.
దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
ఏడు సంవత్సరాల నుంచి తనతో పీకే టచ్ లో ఉన్నాడని చెప్పారు కేసీఆర్. 12 రాష్ట్రాలలో ఇప్పటికే పీకే పని చేశాడని తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో పని చేశాడని అందుకే తాము కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించారు.
తాను దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో దేశ వ్యాప్తంగా అవగాహన ఉన్న పీకేతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం(KCR Prashant Kishor ). ప్రశాంత్ కిషోర్ పైసల కోసం పని చేయడని అన్నారు.
దేశం కోసం తను చిత్తశుద్దితో పని చేస్తున్నాడని కితాబు ఇచ్చారు. ఒక వేళ మీ వద్ద ఆయన ఎవరి వద్దనైనా పైసలు తీసుకున్నట్లు రిపోర్టు మీ వద్ద ఉందా అని ప్రశ్నించారు.
ఉంటే తనకు ఇవ్వాలన్నారు కేసీఆర్. రాజకీయాలపై అవగాహన ఉందనే తాను పీకేను పిలిచానని చెప్పారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతోందన్నారు.
Also Read : తెలంగాణ అంటే ఫ్లవర్ కాదు ఫైర్