Pushkar Singh Dhami : ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న పుష్కర్ సింగ్ ధామీ అనూహ్యంగా తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతిలో పరజాయం పొందారు.
సీఎం ఓడి పోవడం బీజేపీని షాక్ కు గురి చేసింది. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి హరీష్ రావత్ కూడా ఓడి పోయారు.
ఆయనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించిన బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేసింది సీఎం అభ్యర్థుల ఎంపిక విషయంలో.
ఇప్పటికే యూపీలో యోగిదే హవా నడుస్తోంది. ఆయనే రెండోసారి కొలువు తీరనున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ లో అందుకు భిన్నంగా ఫలితం వచ్చినా పుష్కర్ సింగ్ ధామీ వైపే మొగ్గు చూపింది.
సోమవారం జరిగిన ఎల్పీ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా సీఎంగా ఎన్నుకున్నారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, మీనాక్షి లేఖి హాజరయ్యారు మీటింగ్ అనంతరం పుష్కర్ సింగ్ ధామీని(Pushkar Singh Dhami) సీఎంగా ప్రకటించారు.
దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ ను కలిశారు. 46 ఏళ్ల వయసు కలిగిన ధామీ గత ఆరు నెలల కిందటే సీఎంగా కొలువు తీరారు. ఆయన సారథ్యంలోనే పార్టీ ప్రచారంలోకి వెళ్లింది.
పార్టీని విజయ పథంలో నడిపినందుకే అతడికి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఇంత కాలం ఉన్న ఉత్కంఠకు తెర దించింది హైకమాండ్.
Also Read : ‘ఢిల్లీ..దోహా’ విమానం దారి మళ్లింపు