Sidhu : పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ(Sidhu )సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ను టార్గెట్ చేశారు. ఢిల్లీ నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
అంతే కాదు భారీ మెజారిటీతో గెలుపొందిన ఆప్ రాష్ట్రం నుంచి 5 రాజ్యసభ స్థానాలను పొందింది. ఎంపికైన ఎమ్మెల్యేల ఓటు శాతంగా. మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లు దక్కాయి ఆప్ కు.
ఇప్పటి వరకు ఆప్ కు రాజ్యసభలో కేవలం మూడు సీట్లు ఉండగా పంజాబ్ విన్నింగ్ తో మరికొన్ని సీట్లు అదనంగా దక్కాయి. అయితే ఈనెల 31 లోపు రాజ్యసభ ఎన్నికలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతో రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో నలుగురు పంజాబ్ కు చెందని వారు కాగా ఒకే ఒక్కడు, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రమే.
ప్రభుత్వం పంజాబ్ లో ఉంటే రిమోట్ అంతా అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉందన్నారు. పంజాబీయేతరులు, బయటి వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేసి తమ రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారంటూ ఆరోపించారు సిద్దూ(Sidhu ).
కాంగ్రెస్ తో పాటు పంజాబ్ లోక్ కాంగ్రెస్ , శిరోమణి అకాళీదళ్ సైతం తీవ్ర స్థాయిలో ఆప్ చీఫ్ పై ఫైర్ అయ్యాయి.
ఇదిలా ఉండగా ఆప్ నుంచి నామినేట్ అయిన వారిలో పంజాబ్ రాష్ట్రానికి చెందని వారు సందీప్ పాఠక్ , అశోక్ మిట్టల్ , సంజీవ్ అరోరా , రాఘవ్ చద్దా ఉన్నారు.
Also Read : పంజాబ్ లో భగత్ సింగ్ వర్ధంతికి సెలవు