Sonia Gandhi : అసంతృప్త నేత‌ల‌తో మేడం భేటీ

పార్టీ ప్ర‌క్షాళ‌న‌పై ఎడ‌తెగ‌ని చ‌ర్చ

Sonia Gandhi  : కాంగ్రెస్ పార్టీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కుదుపున‌కు లోన‌వుతోంది. ఇప్ప‌టికే జీ23 కి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న గులాం న‌బీ ఆజాద్ కాస్తా మెత్త ప‌డ్డారు. ఆయ‌న ఇటీవ‌ల క‌శ్మీర్ ఫైల్స్ మూవీపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదిలా ఉండ‌గా సోనియా గాంధీ(Sonia Gandhi )ఫ్యామిలీకి వ్య‌తిరేక గ‌ళం వినిపిస్తున్న అసంతృప్త నేత‌ల‌తో మంగ‌ళ‌వారం ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదే స‌మ‌యంలో ఆజాద్ ఇప్ప‌టికే మేడం నాయ‌క‌త్వంలోనే పార్టీ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ కమిటీకి ఎన్నిక‌లు చేప‌ట్టాల‌ని, గాంధీ ఫ్యామిలీ తప్పు కోవాల‌ని , కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల‌ని ప్ర‌ధాన డిమాండ్లు సంధించారు.

ఒకానొక స‌మ‌యంలో గాంధీ ఫ్యామిలీని స‌పోర్ట చేసే వ‌ర్గం ఒక వైపు వ్య‌తిరేకించే వ‌ర్గం మ‌రో వైపుగా మారి పోయింది. ఆజాద్ తో భేటీ త‌ర్వాత గొడ‌వ కాస్తా స‌ద్దు మ‌ణిగింది.

ఇవాళ మేడంతో ప్ర‌త్యేకంగా భేటీ అయిన వారిలో రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష ఉప నాయ‌కుడు ఆనంద్ శ‌ర్మ‌, ఎంపీ మ‌నీశ్ తివారీ ఉన్నారు.

రాబోయే రోజుల్లో జీ23 కి సంబంధించిన నేత‌లు స‌మావేశం కానున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల ద్వారా అందిన స‌మాచారం. రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేయ‌డం,

అంత‌ర్గ‌త విభేదాలు ప‌రిష్క‌రించు కోవ‌డంపై ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు టాక్. తాము పార్టీకి వ్య‌తిరేకం కాద‌ని కానీ బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏం చ‌ర్చించార‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read : చ‌ప్ప‌ట్లు కొట్టండి ప్లేట్లు వాయించం

Leave A Reply

Your Email Id will not be published!