Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)మరోసారి ఫైర్ అయ్యారు. ఆయన సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు బండి సంజయ్,
ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి. త్వరలోనే పాతబస్తీ ఫైల్స్ , అవినీతి ఫైల్స్ బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. సీఎంకు ఈమధ్య సోయి తప్పిందని, ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
పని పాటా లేక గంటల తరబడి మీడియాతో మాట్లాడటం తప్పితే ఒక్క సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. అసెంబ్లీలో ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి రోజులవుతున్నా ఈరోజు వరకు ఒక్క నోటిఫికేషన్ జారీ చేయలేదని మండిపడ్డారు.
ఎన్నికలు వస్తేనే జాబ్స్ గుర్తుకు వస్తాయని కేసీఆర్ మాటలను నిరుద్యోగులు ఎవరూ నమ్మడం లేదన్నారు. కావాలని ఇప్పుడు వరి పేరుతో రాజకీయం చేస్తున్నాడంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు.
పాలన చేత కాక, ఫామ్ హౌజ్ లో పండుకుంటూ సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడుతున్నాడంటూ ఆరోపించారు బీజేపీ చీఫ్.
కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తన స్థాయిని దిగజార్చు కుంటున్నారని పేర్కొన్నారు. పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పి రైతులను నిట్టు నిలువునా కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు.
ఈ రోజు వరకు రాష్ట్రానికి సంబంధించి సమగ్రమైన విధానం లేదన్నారు. ఇండియా గేట్ వద్ద ధాన్యం పోస్తానన్న ఆయన ఏడున్నడని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)పటేల్.
Also Read : పార్టీతో కాదు రేవంత్ తోనే పంచాయతీ