Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతిన చేస్తున్న 35 వేల మందిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల సందర్భంగా ఆప్ ఇచ్చిన హామీ మేరకు దీనిని వెల్లడిస్తున్నట్లు వెల్లడించారు సీఎం. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో పని చేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా గ్రూప్ సీ, డీ లకు చెందిన 35 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు చెప్పారు. తాము హామీ ఇచ్చిన మేరకు దీనిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు భగవంత్ మాన్(Bhagwant Mann ).
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో వీడియో సందేశాన్ని ఇచ్చారు. ఇప్పటికే భగవంత్ మాన్(Bhagwant Mann )సీఎంగా కొలువుతీరిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
10 వేల పోస్టులను పోలీసు శాఖలో , మిగతా 15 వేల పోస్టులను వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా హర్బాల్ సింగ్ చీమాకు ఫైనాన్స్ శాఖ కేటాయించారు. కాగా కీలకమైన హోం వాఖను తన వద్దే ఉంచుకున్నారు భగవంత్ మాన్ .
ఇదిలా ఉండగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 23న రాష్ట్రంలో భగత్ సింగ్ వర్దంతి సందర్భంగా సెలవు ప్రకటించారు.
Also Read : అసంతృప్త నేతలతో మేడం భేటీ