Inquilab Zindabad : ఉపఖండంలో నేటికీ వినిపించే పేరు ఇంక్విలాబ్ జిందాబాద్ . విప్లవం వర్దిల్లాలి. దీనిని మొదటిసారిగా ఈ దేశంలో వాడింది సర్దార్ షహీద్ భగత్ సింగ్. విప్లవం చిరకాలం జీవించాలని అర్థం. పోరాటానికి, త్యాగానికి, ఉద్యమానికి ప్రతీకగా దీనిని నిత్యం వాడుతుంటారు.
ఈ నినాదాన్ని ప్రముఖ ఉర్దూ కవి, భారత స్వాతంత్ర సమర యోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మౌలానా హస్రత్ మోహానీ 1921లో రాశాడు. 1920 చివరలో భగత్ సింగ్ ను ఎక్కువగా ప్రభావితం చేసింది.
1907-1931 లో తన ప్రసంగాలు, రచనల ద్వారా మరింత ప్రాచుర్యం పొందింది ఇంక్విలాబ్ జిందాబాద్(Inquilab Zindabad )అన్నది. భగత్ సింగ్ ద్వారా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధికారిక నినాదం.
కమ్యూనిస్టు కన్సాలిడేషన్ స్లోగన్ గా మారింది. ఈ దేశంలో సత్యం కోసం, న్యాయం కోసం ఉద్యమించే ప్రతి ఒక్కరు నినదించే గొప్ప వాక్యం ఇంక్విలాబ్ జిందాబాద్.
1929లో ఈ నినాదాన్ని భగత్ సింగ్ , అతని సహచరుడు బీకే దత్ దీనిని వాడారు. వీరు ఢిల్లీ లోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత వెళుతూ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించారు. ఆ తర్వాత మొదటి సారిగా ఢిల్లీలోని కోర్టులో మరోసారి నినదాలు చేశారు.
ఆనాటి నుంచి నేటి దాకా భారత దేశంలో ఆ నినాదం అంతర్భాగమై పోయింది. నేటికీ కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నది. సజీవ నాదంగా కోట్లాది మంది నాలుకల మీద సాగుతూనే ఉన్నది ఇంక్విలాబ్ జిందాబాద్.
Also Read : 35 వేల మంది సిబ్బంది రెగ్యులరైజ్