Rakesh Tikait : ఈ దేశం మీ త్యాగాలను ఎప్పటికీ స్మరించు కుంటూనే ఉంటుందన్నారు భారతీయ కిసాన్ యూనియన్ (Indian Kisan Union) జాతీయ అధికార ప్రతినిధి (Top Farmer Leader), రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్.
ఇవాళ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. ఉరి కొయ్యలను ముద్దాడారు ఇదే రోజున. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన సర్దార్ షహీద్ భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait).
ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రాణ త్యాగం చేసిన భారత మాత ముద్దు బిడ్డలు , వీర పుత్రులు. మీ విలువైన పాదాలను తాకుతున్నానని పేర్కొన్నారు రాకేశ్ తికాయత్.
షహీద్ ఆజం సర్దార్ భగత్ సింగ్ , సుఖ్ దేవ్ , రాజ్ గురులను నా వినయ పూర్వకమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు (humble tributes) . వీరులారా మీరు చేసిన త్యాగం, ఈ దేశ యువతకే కాదు కోట్లాది ప్రజలకు, మాకందరికీ స్పూర్తి దాయకంగా నిలుస్తారని పేర్కొన్నారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait).
దేశం విముక్తం కోసమే కాదు సకల మానవులంతా ఒక్కటి కావలని కోరారని, సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఎల్లప్పటికీ నిలిచే ఉంటారని స్పష్టం చేశారు.
మీ త్యాగం ఎప్పటికీ నిలిచే ఉంటుందని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో విలువైన కాలాన్ని వ్యర్థం చేస్తున్న యువత బలిదానాలు చేసిన భగత్ సింగ్ , సుఖ్ దేవ్, రాజ్ గురు లను స్పూర్తి గా తీసుకోవాలని రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు.
తనను జీవితాంతం ప్రభావితం చేసిన వీరులలో ఈ ముగ్గురూ తప్పకుండా ఉంటారని తెలిపారు. అమరులారా వందనం వీరులారా మీకు అభివనందనం అంటూ స్మరించుకున్నారు రాకేశ్ తికాయత్.
Also Read : ఆప్ కా పంజాబ్ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’