Sanjay Raut : ఈడీ దాడుల‌పై శివ‌సేన సీరియ‌స్

సీఎం ఉద్ద‌వ్ బావ మ‌రిది ఆస్తులు జ‌ప్తు

Sanjay Raut : బీజేపీకి (Bharatiya Janata Party) శివ‌సేన‌కు మ‌ధ్య న‌డుస్తున్న వార్ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఇప్ప‌టికే మ‌హా వికాస్ అగాధీ స‌ర్కార్ లో ఇద్ద‌రు మంత్రులకు చెక్ పెట్టింది ఈడీ.

తాజాగా ఏకంగా మ‌రాఠా సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు చెందిన బావ‌మ‌రిది శ్రీ‌ధ‌ర్ మాధ‌వ్ పాంతంక‌ర్ కు చెందిన రూ. 6.5 కోట్ల ఆస్తుల‌ను ఈడీ సీజ్ చేసింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో వీటిని జప్తు చేసిన‌ట్లు తెలిపింది.

ఇదిలా ఉండ‌గా సీఎం బావ‌మ‌రిది గృహ నిర్మితి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి ఆయ‌న య‌జ‌మానిగా ఉన్నారు. శ్రీ‌ధ‌ర్ ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డ్డాడ‌ని త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని అందుకే సీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఈడీ.

ఈ సంస్థ ద్వారా నిర్మాణాలు చేప‌డుతున్నారు. దీంతో ముంబై లోని థాణేలో నీలాంబ‌రి ప్రాజెక్టులో ఉన్న 11 ఫ్లాట్ల‌ను సీజ్ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. దీనిపై శివ‌సేన (Shiv Sena) సీరియ‌స్ గా స్పందించింది.

కావాల‌ని వేధింపుల‌కు పాల్ప‌డుతోందంటూ ఆరోపించింది. త‌మ‌కు లొంగ‌ని వారిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తోందంటూ మండిప‌డింది. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు ధోర‌ణి త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ఫైర్ అయ్యింది.

దీనిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. శివ‌సేన (Shiv Sena) జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ (Sanjay Raut)నిప్పులు చెరిగారు. బీజేపీకి (Bharatiya Janata Party) పోయే కాలం ద‌గ్గ‌ర ప‌డింద‌న్నారు.

జిన్నా ఒక్క‌సారే దేశాన్ని విభ‌జించార‌ని కానీ వీరు కొలువు తీరాక నిత్యం జ‌నం మ‌ధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు.

Also Read : మీ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!