Imran Khan : పీక‌ల లోతు క‌ష్టాల్లో ఖాన్ సాబ్

హ్యాండిచ్చిన మిత్ర‌ప‌క్షాలు

Imran Khan  : ఇమ్రాన్ ఖాన్ జ‌గ మెరిగిన మాజీ క్రికెట‌ర్. పాకిస్తాన్ జ‌ట్టుకు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వ‌చ్చాడు. ఆపై ఏకంగా ఆ టీమ్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ తెచ్చిన ఘ‌న‌త కూడా అత‌డిదే.

మైదానంలో మెరుపులాంటి బంతుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను భ‌య‌పెట్టిన ఈ మాజీ కెప్టెన్ ఇప్పుడు దేశాన్నిప్ర‌ధానిగా కంట్రోల్ లో ఉంచ లేక నానా తంటాలు ప‌డుతున్నాడు. రాజ‌కీయాలు వేరు ఆట వేరు.

ఆడినంత సులభం ఇక్క‌డ ఆడ‌లేం. పొద్ద‌స్తమానం దాయాది దేశంపై ఉన్నంత ఫోక‌స్ త‌న దేశంపై పెట్టి ఉండి ఉంటే ఈ ఇబ్బంది త‌లెత్తేది కాదు.

ప్ర‌స్తుతం ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇమ్రాన్ ఖాన్ (Imran Khan )ప‌రిస్థితి వెంటిలేట‌ర్ మీద ఉన్న‌ట్టుగా ఉంది. న‌మ్ముకున్న మిత్ర‌పక్షాలే ఉన్న‌ట్టుండి హ్యాండి ఇచ్చాయి.

దీంతో మ‌నోడి ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. నిన్న‌టి దాకా కారాలు మిరాయాలు నూరాడు. ప్ర‌పంచంలో త‌న‌కు ఎదురే లేద‌న్న‌ట్టు ప్ర‌య‌త్నం చేశాడు.

అర‌బ్ కంట్రీస్ ను ఏకం చేద్దామ‌నుకున్నాడు. అమెరికాతో దోస్తీ చేశాడు. ఆపై దానిని అడ్డం పెట్టుకుని ఆఫ్గ‌నిస్తాన్ ను ఎగ దోశాడు. చైనాతో చెలిమి చేశాడు.

ర‌ష్యాతో స్నేహానికి ఓకే చెప్పాడు. ప‌వ‌ర్ ఉన్నంత కాలం భార‌త్ పై ఆడి పోసుకున్నాడు. కానీ ఇప్పుడు త‌న సీటుకే ఎస‌రు కొచ్చేస‌రిక‌ల్లా భార‌త ఆర్మీ గొప్ప‌ద‌ని, ఆ దేశ విదేశాంగ విధానం సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan ).

త‌న‌కు వెన్నంటి ఉంటాయ‌ని ఆశిస్తూ వ‌చ్చిన మూడు మిత్ర‌ప‌క్ష పార్టీలు డోంట్ కేర్ అని ఝ‌లక్ ఇచ్చాయి. దీంతో మ‌నోడిలో వ‌ణుకు మొద‌లైంది. చిట్ట చివ‌రి ప్ర‌య‌త్నంగా ఆర్మీని కోరాడు. అది కూడా హ్యాండిచ్చింది. ఉంటాడా లేదా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : ర‌ష్యాను చూస్తే భార‌త్ కు భ‌యం – బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!