Kodali Nani : ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇవాళ నిప్పులు చెరిగారు. ఏపీలో మద్యానికి బార్లా తెరిచిన ఘనత, ఆ పాపం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిదేనని మండిపడ్డారు.
ఏకంగా రాష్ట్రంలో 240 మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిన ఘనమైన, నీచమైన చరిత్ర ఆయనది కాదా అని నిలదీశారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో చీప్ లిక్కర్ ను ప్రవేశ పెట్టింది కూడా ఆయనదేనంటూ మండిపడ్డారు కొడాలి నాని(Kodali Nani).
ఆనాటి దివంగత సీఎం నందమూరి తారక రామారావు హయాంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు పవర్ లోకి వచ్చాక 18 నెలల్లోపే మళ్లీ మద్యానికి ప్రవేశం కల్పించిన చరిత్ర ఈయనదేనని ఫైర్ అయ్యారు.
మద్యాన్ని ఎంకరేజ్ చేసి దోచిపెట్టిన చంద్రబాబుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే హక్కు లేదన్నారు. ఏపీలో కొలువు తీరాక 45 వేల బెల్ట్ షాపులను రద్దు చేసిన చరిత్ర జగన్ దని చెప్పారు.
అంతే కాకుండా స్కూళ్లు, ఆలయాల వద్ద వైన్స్ షాపులను తీసి వేయించిన ఘనత మన సీఎందేనని ఆ విషయం మరిచి పోతే ఎలా అని నిలదీశారు కొడాలి నాని. చంద్రబాబు ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నాడంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఆయన పాలించడం రాష్ట్రం పాలిట శాపంగా మారిందన్నారు. బాబు చేసిన అడ్డగోలు అప్పులు, అసంబద్ద నిర్ణయాల వల్లే ఇవాళ ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటన్నింటిని పరిష్కరిస్తూ సీఎం ప్రజా పాలన అందిస్తున్నారని అన్నారు.
Also Read : సచివాలయాల భారం ఇక పంచాయితీలకే?