Jyotiraditya Scindia : యూపీఏ నిర్వాకం వ‌ల్లే అమ్మేశాం

మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా

Jyotiraditya Scindia : దేశంలో గంప గుత్త‌గా ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్ముకుంటూ వెళుతున్న మోదీ స‌ర్కార్ నిస్సిగ్గుగా స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఓ వైపు దేశానికి , భ‌క్తికి తామే పేటెంట్ అంటూ ప్ర‌చారం చేసుకుంటున్న బీజేపీ వాట‌న్నింటికీ తిలోద‌కాలు ఇచ్చింది.

న‌ష్టాల పేరుతో సంస్థ‌ల‌ను ప్రైవేట్ ప‌రం చేస్తోంది. తాజాగా లోక్ స‌భ‌లో ఎయిర్ ఇండియా అమ్మ‌కంపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నిన్న‌టి దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి జంప్ అయ్యారు. ఎయిర్ ఇండియా సంస్థ‌ను టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు క‌ట్ట‌బెట్టంది మోదీ ప్ర‌భుత్వం. ప్ర‌భుత్వ సంస్థ‌ను ఎలా విక్ర‌యిస్తారంటూ ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాయి.

లాభాల్లో న‌డుస్తున్న ఎయిర్ ఇండియాను న‌ష్టాల్లోకి నెట్టి వేసింది యూపీఏ స‌ర్కారేనంటూ సింధియా ధ్వ‌జ‌మెత్తారు. దీనికి తాము బాధ్యులం కామ‌ని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా భారీ న‌ష్టాలు చ‌వి చూస్తున్న సంస్థ‌ల‌ను తాము ఇక మోయ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా ధ‌నం సంర‌క్ష‌ణే త‌మ ల‌క్ష్య‌మన్నారు.

అందుకే ఇండియా డిజిన్వెస్ట్ మెంట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. పౌర విమాన‌యాన శాఖ‌కు సంబంధించి ఏకంగా 8 గంట‌ల పాటు చ‌ర్చ జ‌రిగింది.

ఎయిర్ ఇండియా అమ్మ‌కం, 111 కొత్త విమానాల కొనుగోలు , త‌దిత‌ర అంశాల‌పై మంత్రి స‌మాధానం ఇచ్చారు. భారంగా మార‌డం వ‌ల్ల‌నే తాము అమ్మాల్సి వ‌చ్చింద‌న్నారు జ్యోతిరాదిత్యా సింధియా.

Also Read : లంచం అడిగితే 9501200200 కు చేయండి

Leave A Reply

Your Email Id will not be published!