Arindam Bagchi : చైనా కామెంట్స్ ఇండియా సీరియ‌స్

జ‌మ్మూ కాశ్మీర్ అంశం పై స్ట్రాంగ్ కౌంట‌ర్

Arindam Bagchi  : ఓ వైపు చ‌ర్చ‌ల‌కు సిద్దం అంటూనే మ‌రో వైపు భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంది డ్రాగ‌న్ చైనా. జ‌మ్మూ కాశ్మీర్ పై చైనా మంత్రి చేసిన కామెంట్స్ పై ఇండియా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

కేంద్ర పాలిత ప్రాంతం జ‌మ్మూ ,క‌శ్మీర్ కు సంబంధించిన విష‌యాలు పూర్తిగా భార‌త దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌కు సంబంధించింది. చైనాకు కానీ లేదా ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌కు కానీ వ్యాఖ్యానించేందుకు ఎటువంటి హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేసింది .

ఈ విష‌యాన్ని మ‌రోసారి ఖ‌రాఖండితంగా పేర్కొంది భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ‌. ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ లో జ‌రుగుతున్న ఇస్లామిక్ కో ఆప‌రేష‌న్ సంస్థ నిర్వ‌హించిన సమావేశంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి జ‌మ్మూ క‌శ్మీర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

దీనిని తాము తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు తెలిపింది. దీనిని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. భార‌త దేశం త‌మ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌పై బ‌హిరంగ తీర్పున‌కు దూరంగా ఉంద‌ని విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి (Arindam Bagchi )పేర్కొన్నారు.

చైనా విదేశాంగ మంత్రి ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. కాశ్మీర్ పై ఇస్లామిక్ స్నేహితులు చాలా మంది ప్ర‌స్తావించారు. దానిని మేము కూడా విన్నామ‌ని వాంగ్ యి చెప్ప‌డంపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

ఇదిలా ఉండ‌గా వాంగ యి రెండు రోజుల్లో ఇండియాకు రానున్నారు. జ‌మ్మూ కాశ్మీర్ విష‌యంలో త‌న వ్యూహాత్మ‌క మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ వైఖ‌రికి చైనా ప‌దే ప‌దే త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది.

Also Read : స‌మ‌స్య‌ల‌పై యుద్దం ప్ర‌భుత్వంపై పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!