Uddhav Thackeray : మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray)సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి మోదీ, బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే నన్ను జైళ్లో పెట్టాలని సవాల్ విసిరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మరాఠాను టార్గెట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్నారు.
ఇటీవలే సీఎం బావమరిదికి సంబంధించిన రూ. 6.45 కోట్ల ఆస్తులను స్తంభింప చేసింది.
దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఉద్దవ్ ఠాక్రే. మీరు నన్ను జైల్లో పెట్టాలని అనుకుంటున్నారా అని నిలదీశారు.
కానీ తాము అధికారం ఉంది కదా అని భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులను ఎవరినీ టార్గెట్ చేయలేదన్నారు. కానీ పదే పదే తమతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు సీఎం.
బావమరిది ఆస్తులను జప్తు చేసిన మూడు రోజుల తర్వాత తీవ్రంగా స్పందించారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). మీరు అధికారంలోకి రావాలంటే రండి. ఇందులో తప్పు లేదు. ఇతర కుటుంబీకులను వేధించడం మాను కోవాలన్నారు.
తాము మీ కుటుంబీకులను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు ఉద్దవ్ ఠాక్రే. ఒక వేళ జైలులో పెట్టాలని అనుకుంటే తనను పెట్టండి అని సవాల్ విసిరారు.
ఇదిలా ఉండగా బావమరిది ఆస్తుల జప్తు తర్వాత తన కుమారుడు ఆదిత్యా ఠాక్రే, సన్నిహితులుగా భావించే వ్యక్తులపై వరుసగా ఐటీ దాడులు చేసింది.
Also Read : యోగి కేబినెట్ లో ఇద్దరూ డిప్యూటీ సీఎంలు