Yogi Adityanath : యూపీ సీఎంగా రెండోసారి ముఖ్యమంత్రి (Chief Minister) గా కొలువు తీరిన యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath )కీలక నిర్ణయం తీసుకున్నారు ( Chief Minister of Uttar Pradesh). ఇవాళ కొత్త కేబినెట్ తో సమావేశం అయ్యారు.
అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కరోనా కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఈ ఉచిత రేషన్ పథకం గతంలో అమలు చేశామని, దానిని ఈసారి కూడా పొడిగిస్తున్నట్లు యోగి తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో 403 సీట్లకు గాను బీజేపీ (BJP) కూటమి 273 సీట్లు గెలుపొందింది. కూటమితో కాకుండా బీజేపీ (BJP) 255 సీట్లను చేజిక్కించుకుంది. అంతా తానై బీజేపీని, రాష్ట్రాన్ని ముందుండి నడిపించాడు సీఎం (CM) యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath ).
37 ఏళ్ల అనంతరం రెండో సారి సీఎంగా కొలువు తీరారు యోగి. సీఎం (CM) అధ్యక్షతన కొత్త కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది.ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని నిర్నయించామని చెప్పారు యోగి.
దీని వల్ల రాష్ట్రంలోని 15 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. ఈ ఒక్క పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 3, 270 కోట్లు ఖర్చుచేస్తుందని స్పష్టం చేశారు సీఎం(CM).
ఇదిలా ఉండగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంబించింది ఈ పతకాన్ని ప్రభుత్వం. గడువు ముగియడంతో అంతా నిలుపుదల చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రజలు మరోసారి పవర్ లోకి వచ్చే లా చేసినందుకు గిప్ట్ గా ఇచ్చారు సీఎం(CM).
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు పేదల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప (Chief Minister) ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ తెలిపారు.
Also Read : మద్దతు ధర కోసం మళ్లీ ఉద్యమం