Afghan Girls : చ‌దువు కోసం యువ‌త పోరాటం

ఆఫ్గాన్ స‌ర్కార్ నిర్వాకంపై ఫైర్

Afghan Girls : ఆఫ్గ‌నిస్తాన్ ను ఏలుతున్న తాలిబ‌న్లు రోజు రోజుకు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బాలిక‌ల‌కు చ‌దువు ఉండ కూడ‌దంటూ ఫ‌త్వా జారీ చేశారు. గ‌త ఏడు నెల‌ల నుంచి పాఠ‌శాల‌ల‌ను బంద్ చేశారు.

దీంతో తాము చ‌దువుకుంటామ‌ని యువ‌త ( బాలిక‌లు ) రోడ్డెక్కారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

త‌మ‌కు చ‌దువు కావాల‌ని, విద్య‌నే వికాసాన్ని క‌లిగిస్తుంద‌ని నినాదాలు చేశారు.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా స్కూళ్లు తెర‌వాల‌ని వ‌త్తిళ్లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి హృద‌య విదార‌క దృశ్యాలు కంట‌త‌డి పెట్టిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో ఈ చిత్రాలు వైరల్ గా మారాయి. ఇప్ప‌టికీ ఆఫ్గాన్ లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

కాంద‌హార్ లోని ఓ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో విద్యా సంవ‌త్స‌రం ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా బాలిక‌లు తాలిబ‌న్ జెండాలు ప‌ట్టుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇదిలా ఉండ‌గా ఆఫ్త‌నిస్తాన్ ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకున్న కొన్ని నెల‌ల త‌ర్వాత పౌరులు,

యువ‌తీ యువ‌కులు నిర‌స‌న‌లు(Afghan Girls) చేస్తూనే ఉన్నారు. వీరి ఆందోళ‌న‌లు ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తున్నాయి.

బాలిక‌ల విద్య‌ను అర్ధాంత‌రంగా నిలిపి వేయ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌కు దారి తీసేలా ఉంది.

పిల్ల‌లు చ‌దువుకునేందుకు వ‌చ్చిన వెంట‌నే మాధ్య‌మిక పాఠ‌శాల‌ల‌ను మూసి వేస్తున్న‌ట్లు ఆఫ్గాన్ ప్ర‌భుత్వం(Afghan Girls) ప్ర‌క‌టించింది.

దాదాపు ఏడు నెల‌ల పాటు బ‌డుల‌ను మూసి వేశారు. ఆల్ జజీరా నివేదిక ప్ర‌కారం ఇస్లామిక్ చ‌ట్టం, ఆఫ్గ‌నిస్తాన్ సంస్కీతికి అనుగుణంగా ఒక ప్లాన్ రూపొందించేంత వ‌ర‌కు 6వ త‌ర‌గ‌తి ఆపైన ఉన్న బాలిక‌ల బ‌డులు మూసి వేస్తున్న‌ట్లు విద్యా మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది.

త‌దుప‌రి ఆర్డ‌ర్ ఇచ్చేంత వ‌ర‌కు వారంతా ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 16 దేశాల‌కు చెందిన మ‌హిళా విదేశాంగ మంత్రులు ఆఫ్గ‌నిస్తాన్ చ‌ర్య‌ను ఖండించాయి. వెంట‌నే బ‌డులు తెర‌వాల‌ని కోరాయి.

Also Read : నాటో మౌనం ఆగ‌ని యుద్దం

Leave A Reply

Your Email Id will not be published!