Congress Protest : మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి(Congress Protest) సిద్దమవుతోంది. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
పార్టీకి చెందిన శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, బాధ్యులు పాల్గొనాలని సూచించింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ రాష్ట్రాల అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికల కంటే ముందు పెంచకుండా ఫలితాలు వెలువడిన వెంటనే ఐదు రోజుల్లో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెంచాయి ఆయిల్, గ్యాస్ కంపెనీలు. ఈ మేరకు ఈనెల 31న దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ఆరోజు ఉదయం 11 గంటలకు ప్రజలు తమ ఇళ్ల వెలుపల , బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లతో దండలు వేసి, డప్పులు కొట్టి, ఇతర వాయిద్యాలతో మోదీ సర్కార్ దిగి వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు మేడం సోనియా గాంధీ.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీపై నిప్పులు చెరిగారు.
చప్పట్లు చరచండి.. తప్పట్లు వాయించండి అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎంగా కొలువు తీరిన యోగి ఆదిత్యానాథ్ గురించి. రాజు రాజభవనానికి సిద్దమయ్యాడు.
ప్రజలు ద్రవ్యోల్బణంతో కొట్టు మిట్టాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మోదీ నుంచి దేశాన్ని రక్షించుకుందామంటూ పిలుపునిచ్చింది పార్టీ.
Also Read : 5 ఏళ్లు 20 లక్షల కొలువులు