Dwayne Bravo : చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో(Dwayne Bravo) ఐపీఎల్ లో అరుదైన ఘనత సాధించాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో సామ్ బిల్లింగ్స్ వికెట్ తీయడంతో అరుదైన ఫీట్ సాధించాడు.
గతంలో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం రసిత్ మలింగ పేరు మీద ఉండేది. 170 వికెట్లు పడగొట్టిన బ్రావో మలింగతో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు.
రసిత్ మలింగ, బ్రావో తర్వాత 160 వికెట్లు తీసి రెండో ప్లేస్ లో నిలిచాడు. 1983 అక్టోబర్ 7న శాంటా క్రూజ్ లో పుట్టాడు. 38 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్ ఈ వయసులో కూడా టాప్ లో ఉండడం విశేషం.
అవసరమైతే బ్యాటింగ్ తో ఆదుకుంటాడు. ఫీల్డింగ్ , బౌలింగ్ లో సత్తా చాటడంలో మనోడు దిట్ట. ఇప్పటి వరకు బ్రావో వెస్టిండీస్ తరపున ఆడాడు.
ఆ జట్టుతో పాటు ముంబై ఇండియన్స్ , ఎసెక్స్ , విక్టోరియా, చెన్నై సూపరి కింగ్స్ , సిడ్నీ సిక్సర్స్ , చిట్టగాంగ్ కింగ్స్ , ట్రినిడాడ్ అండ్ టొబాగో తరపున ఆడాడు.
ట్రిన్ బాగో నైట్ రైడర్స్ , మెల్ బోర్న్ రెనిగేడ్స్ , డాల్ఫిన్స్ , కేప్ కో బ్రాస్ , లాహోర్ డ్యాష్ టాస్ , సురరీయామి, గుజరాతిక్ క్వాలండర్స్ , కొమిల్లా విక్టోరియన్స్ , పెషావర్ జల్మీ, విన్నీ పెగ్ హాక్స్ , మిడిల్ సెక్స్ , పార్ల్ రాక్స్ , మరాఠా అరేబియన్స్ , మెల్ బోర్న్ స్టార్స్ , క్వెట్టా గ్లాడియేటర్స్ , ఢిల్లీ బుల్స్ , సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ , ఫార్చ్యూన్స్ బరిష్ లో ఆడాడు.
Also Read : మిథాలీ రాజ్ సేనకు అగ్ని పరీక్ష