Flights Start : అంత‌ర్జాతీయ విమానాలకు గ్రీన్ సిగ్న‌ల్

అనుమ‌తి ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

Flights Start : కేంద్ర ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. క‌రోనా కార‌ణంగా నిలిపి వేసిన ఇంట‌ర్నేష‌న‌ల్ విమానాల‌కు ప‌చ్చ జెండా ఊపింది. ఈ మేర‌కు విమాన ఛార్జీలు పెంచుతున్నారా లేదా అన్న‌ది ఇంకా స్ప‌ష్టం చేయ‌లేదు.

మారిష‌స్, మ‌లేషియా, థాయ్ లాండ్ , ట‌ర్కీ, అమెరికా, ఇరాక్ తో పాటు 40 దేశాల‌కు ఇక నుంచి ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 60 విదేశీ విమానయాన సంస్థ‌లు ఇండియాకు రావ‌చ్చు పోవ‌చ్చు.

క‌రోనా దెబ్బ‌కు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగా విదేశాల‌కు విమాన రాక పోక‌ల‌పై నిషేధం విధించింది మోదీ ప్ర‌భుత్వం. ఇవాల్టి నుంచి రెగ్యుల‌ర్ షెడ్యూల్డ్ అంత‌ర్జాతీయ ఫ్లైట్స్ ప్రారంభం (Flights Start)అయ్యాయి.

అంత‌ర్జాతీయ విమానాలు అనేక దేశాల‌తో ఎయిర్ బ‌బుల్ ఏర్పాటు చేశాయి. దీంతో ఇండియాకు రావ‌డానికి ఇక్క‌డి నుంచి విదేశాల‌కు వెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదుర‌య్యాయి.

విమానాశ్ర‌యాలు, విమానాల‌లో సామాజిక దూరం ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర స‌ర్కార్. విమానంలో మూడు ఖాళీ సీట్లు క‌లిగి ఉండాల‌న్న క‌రోనా రూల్ ను తొల‌గించింది.

సాధార‌ణ అంత‌ర్జాతీయ విమానాల కోసం ఈ ఆమోదం ఈరోజు నుంచి అక్టోబ‌ర్ 29 వ‌ర‌కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఎయిర్ బ‌బుల్ ఒప్పందాల ప్ర‌కారం విమానాల సంఖ్య వారానికి 2000కి ప‌రిమితం చేశారు.

టికెట్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. స‌డ‌లించిన కోవిడ్ నియ‌మాలు, క్యాబిన్ సిబ్బంది ఇక పై వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ప‌రిక‌రాల‌ను ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది.

ఇండిగోతో పాటు ప్రైవేట్ విమాన‌యాన సంస్థ‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్ స్టార్ట్ చేసేందుకు స‌మాయ‌త్తం అయ్యాయి.

Also Read : భార‌తీయ ఉత్ప‌త్తుల ప్ర‌తిష్ట‌ను పెంచాలి

Leave A Reply

Your Email Id will not be published!