Yadagirigutta : ఇక యాద‌గిరిగుట్ట దివ్య ద‌ర్శ‌నం

ఆరు ఏళ్ల అనంత‌రం ప్రారంభం

Yadagirigutta : భ‌క్తుడైన సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యాద‌గిరిగుట్ట ఆల‌య పున‌ర్ నిర్మాణం(Yadagirigutta) పూర్త‌యింది. ఇక భ‌క్తుల‌కు శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ్మ స్వామి ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నాడు. ఆరేళ్ల త‌ర్వాత పూర్తి స్థాయిలో కొలువు తీరింది ఈ ఆల‌యం.

ప్ర‌పంచ స్థాయిలో ఏ ఆల‌యానికి తీసిపోని విధంగా దీనిని తీర్చిదిద్దారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ఇప్ప‌టిలే పూజ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. సోమ‌వారం నుంచి భ‌క్తుల‌కు ఇక శీఘ్ర ద‌ర్శ‌నం క‌ల‌గ‌నుంది.

తొలి భ‌క్తుడిగా కేసీఆర్ పూజ‌లు చేశాక ఇక అంద‌రికీ ద‌ర్శ‌న భాగ్యం క‌ల‌గ‌నుంది. ఆల‌య నిర్మాణం పూర్తిగా శ్రీ‌వైష్ణ‌వ భ‌క్తి సంప్ర‌దాయం ఉట్టి ప‌డేలా తీర్చిదిద్దారు. ఇక ఆల‌య నిర్మాణం యాద‌గిరిగుట్ట ఆల‌య అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది.

దీనికి చైర్మ‌న్ గా సీఎం ఉండ‌గా వైస్ చైర్మ‌న్ గా కిష‌న్ రావు ఉన్నారు. రూ. 1200 కోట్ల‌తో పున‌ర్ నిర్మాణం పూర్త‌యింది. రోడ్లు, కాటేజీల నిర్మాణం చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా రోజుకు 40 వేల మంది వ‌చ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా 15 కాటేజీలు నిర్మించారు. భ‌క్తులు వ‌చ్చి పోయేందుకు వీలుగా బ‌స్ టెర్మిన‌ల్ ఏర్పాటు చేయ‌నున్నారు.

వెంక‌ట‌కృష్ణ‌, పోతులూరు చారి, రాము, త‌దిత‌ర శిల్పులు ఇందులో పాలు పంచుకున్నారు. ప్ర‌స్తుతం అక్ష‌య‌పాత్ర ఆధ్వ‌ర్యంలో ప్ర‌సాదం త‌యారు చేస్తున్నారు.

సీఎంతో పాటు చిన్న‌జీయ‌ర్ స్వామి హాజ‌ర‌వుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చాలా మంది భ‌క్తులు ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేసి అద్భుతంగా అనిపిస్తున్నా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ్ముడి అస‌లు రూపంలా ఉండ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Also Read : తిరుమ‌ల‌లో సోలార్ సిస్ట‌మ్ ఏర్పాటు చేద్దాం

Leave A Reply

Your Email Id will not be published!