Imran Khan : పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒకప్పుడు ఆ దేశ క్రికెట్ జట్టుకు కెప్టెన్. ఆ జట్టుకు వరల్డ్ కప్ కూడా తీసుకు వచ్చాడు. ప్రత్యర్థులకు తన బౌలింగ్ తో, బంతులతో ముచ్చెమటలు పట్టించిన ఘనుడు ఈ మాజీ క్రికెటర్.
కానీ ప్రధానమంత్రిగా కొలువు తీరాక ఆట కాదు ఇది రాజకీయమని తెలుసుకునే సరికల్లా పుణ్యకాలం కాస్తా పూర్తయింది. మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ముప్పు ఏర్పడింది.
తను నమ్ముకున్న పార్టీలే తనకు శత్రువులుగా మారాయి. మరో వైపు విపక్షాలు దిగి పోవాలని కోరుతున్నాయి. ఇక ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా ఉంటూ వచ్చిన ఆర్మీ సైతం ఇమ్రాన్ ఖాన్ కు సపోర్ట్ చేయడం లేదు.
తాజాగా ఇమ్రాన్ ఖాన్ భారత ఆర్మీ, విదేశాంగ విధానం గురించి కితాబు ఇచ్చారు. రాజీ పడితే ఉండగలుగుతారు లేదంటే రాజీనామా చేయక తప్పదని రాజకీయ వర్గాల అంచనా.
విచిత్రం ఏమిటంటే ఇమ్రాన్ పార్టీకి 7.32 లక్షల అమెరికా డాలర్ల మేర నిషేధిత విదేశీ నిధులు అందాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
349 విదేశీ కంపెనీలతో పాటు 88 మంది వ్యక్తుల నుంచి ఇవి వచ్చాయంటూ కుండ బద్దలు కొట్టింది. ముందస్తు గా ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు లేక పోలేదన్న ప్రచారం జరుగుతోంది.
మరో వైపు తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఇమ్రాన్(Imran Khan) కేబినె ట్ లోని 50 మంది మంత్రులు కనిపించకుండా పోవడం సంచలనం రేపుతోంది.
Also Read : చదువు కోసం యువత పోరాటం