CM Assam : కేజ్రీవాల్ పై హిమంత శ‌ర్మ ఫైర్

ది కాశ్మీర్ ఫైల్స్ పై కామెంట్స్ త‌గ‌దు

CM Assam  : వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ చిత్రంపై నిప్పులు చెరిగారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఆ చిత్రాన్ని రాజ‌కీయంగా బీజేపీ వాడుకుంటుందోంటూ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ వేదిక‌గా బీజేపీ ప్ర‌జా ప్ర‌తినిధులు సినిమాకు వినోద ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోర‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా ఎంత మంది కాశ్మీర్ పండిట్ల‌కు లోయ‌లో అవ‌కాశం క‌ల్పించారంటూ ప్ర‌శ్నించారు కేజ్రీవాల్. విచిత్రం ఏమిటంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ది క‌శ్మీర్ ఫైల్స్ కు ప్ర‌చార క‌ర్త‌గా మారార‌ని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా ఆ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ సంద‌ర్బంగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ (CM Assam )స్పందించారు. సినిమా గురించి మాట్లాడే నైతిక హ‌క్కు అర‌వింద్ కేజ్రీవాల్ కు లేద‌ని మండిప‌డ్డారు.

స‌మాజాన్ని కించ ప‌రిచే హ‌క్కు ఎవ‌రిచ్చారంటూ ప్ర‌శ్నించారు హిమంత బిశ్వ శ‌ర్మ‌. హిందూ వ్య‌తిరేకిగా ఢిల్లీ సీఎం మారారంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా సినిమా దేశాన్నిఉద్ద‌రించేదైతే ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాల‌ని చిత్ర నిర్మాత‌ల‌ను కోరారు. ఢిల్లీ సీఎం పూర్తిగా హిందూ వ్య‌తిరేకిగా మార కూడ‌ద‌ని సూచించారు అస్సాం సీఎం.

దేశ వ్యాప్తంగా సినిమాను అద్భుతంగా ఆద‌రిస్తున్నారంటూ సీఎం బిశ్వ శ‌ర్మ తెలిపారు.

Also Read : భార‌తీయ ఉత్ప‌త్తుల ప్ర‌తిష్ట‌ను పెంచాలి

Leave A Reply

Your Email Id will not be published!