Pramod Sawant : గోవా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమోద్ సావంత్. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర దామోదర దాస్ మోదీ హాజరయ్యారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) 20 సీట్లు కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్ల మద్దతుతో రెండోసారి అధికారంలోకి వచ్చింది.
ఇదిలా ఉండగా ఈసారి కూడా ప్రమాద్ సావంత్ కొంకణి భాషలో ప్రమాణం చేశారు. గోవా రాష్ట్ర రాజధాని పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమోద్ సావంత్(Pramod Sawant )తో.
కాగా సావంత్ కు 48 ఏళ్లు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ , మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ , తదితర ప్రముఖులు హాజరయ్యారు.
దీంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే రాజ్ భవన్ వెలుపల గోవా సీఎంగా సావంత్ (Pramod Sawant )ప్రమాణం చేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం.
అంతకు ముందు 2012లో బీజేపీ సభలో అతి పెద్ద పార్టీగా అవతరించిన తర్వాత పనాజీలోని క్యాంపల్ గ్రౌండ్ లో మనోహర్ పారికర్ (Manohar Parrikar) రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు.
రేపటి నుంచి కొత్త అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. సావంత్ తనకు ఉన్న బలాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది.
Also Read : బీహార్ సీఎంపై దాడి – వ్యక్తి అరెస్ట్