Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ లో ఇవాళ శాసనసభ రణరంగాన్ని తలపింప చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, విపక్ష భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
భీర్బూమ్ దహనం ఘటన కేసులో ముమ్మాటికీ బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, దీనిపై సీఎం మమతా బెనర్జీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత సువేందు అధికారి.
దీంతో టీఎంసీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక్కడే ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వావాదం తారా స్థాయికి చేరింది. ఒకరిమరొకరు తోసుకున్నారు. కొందరు కింద పడ్డారు.
మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. ఎమ్మెల్యేల కిష్కింధకాండను చూసి జనం నవ్వుకున్నారు. వీరేనా మనం ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులని. సువేందు అధికారి తనపై దాడికి పాల్పడ్డాడంటూ టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు.
దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో సువేందు అధికారితో పాటు మరో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మార్షల్స్ సాయంతో ఎమ్మ్యేలను బయటకు తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడ్డారు.
దీంతో చాలా సేపు సభలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది. గొడవ జరిగిన వెంటనే సువేందు (Suvendu Adhikari)నేతృత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇదే సమయంలో ఈ హత్యలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు సువేందు అధికారి. తమపై దాడికి పాల్పడటమే కాకుండా మేమే దాడికి పాల్పడినట్లు చిత్రీకరించారని, కావాలని కుట్ర పన్నారంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు.
Also Read : ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే – బీజేపీ