Ajit Pawar :మహారాష్ట్ర సర్కార్ కు భారతీయ జనతా పార్టీకి పడడం లేదు. ఓ వైపు కేంద్రం మరో వైపు రాష్ట్రం మధ్య ప్రత్యక్ష యుద్దం నడుస్తోంది. ఈ తరుణంలో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సంచలన కాంమెంట్స్ చేశారు మహా వికాస్ అగాధీ సంకీర్ణ సర్కార్ పై.
దీనిపై స్పందించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar ). మరాఠాలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎంవీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఈ విషయం పాటిల్ కు తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
పోనీ కేంద్రంలో మీ ప్రభుత్వం ఎలా నడుస్తుందో ఎవరి సహకారంతో నడుస్తుందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఎంవీఏ ప్రభుత్వాన్ని ఎన్సీపీ నడుపుతోందంటూ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అజిత్ పవార్.
ఇది పూర్తిగా దురుద్దేశంతో చేసిన కామెంట్స్ తప్ప మరొకటి కాదన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తిగా ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో తామంతా కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు.
ఇందులో ఠాక్రే కీలకమైన పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎంకు మద్దతుగా ఉన్నాయని పేర్కొన్నారు.
వివీఏ కూటమి ఎన్సీపీ భర్త, శివసేన నిశ్శబ్ద భార్య, కాంగ్రెస్ పిలవని పేరంటానికి వచ్చే అతిథి అయిన వివాహానికి సమానమని బీజేపీ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీనిపై మండిపడ్డారు అజిత్ పవార్.
Also Read : అరుదైన దృశ్యం కత్తుల కరచాలనం