KTR USA : కేటీఆర్ యుఎస్ టూర్ స‌క్సెస్

తెలంగాణ‌కు భారీ ఎత్తున పెట్టుబ‌డులు

KTR : వారం రోజుల పాటు పెట్టుబ‌డులు తీసుకు రావ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్ స‌క్సెస్ అయ్యింది. టూర్ లో భాగంగా ప‌లు కంపెనీల సిఇఓలు, ఎండీల‌ను క‌లిశారు.

ఇందులో భాగంగా, ఐటీ కంపెనీల చీఫ్ ల‌తో స‌మావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేలా కృషి చేశారు. దేశానికి తెలంగాణ ఆద‌ర్శంగా మారింద‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

అంతే కాకుండా ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల గురించి తెలిపారు. టీఎస్ ఐఎస్ పాల‌సీని తీసుకు వ‌చ్చామ‌ని అప్లై చేసుకున్న 15 రోజుల్లోనే ప‌ర్మిష‌న్ ఇస్తున్నామ‌ని చెప్పారు.

కేటీర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. దీంతో అమెరికాలోని ప‌లు కంపెనీలు తెలంగాణ‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి.

క్వాల్క‌మ్ , అడ్వెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ తో పాటు మ‌రికొన్ని కంపెనీలు రూ. 7500 కోట్ల మేర‌కు పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీక‌రించాయి.

వివిధ కంపెనీల‌తో పాటు ఎన్నారైలో వ‌రుస‌గా స‌మావేశమ‌య్యారు. ఈ వారం రోజుల్లో 35 మీటింగ్ ల‌లో కేటీఆర్ (KTR)పాల్గొన్నారు. మ‌రో వైపు మ‌న ఊరు మ‌న బ‌డి కోసం స‌హ‌కారం అందించాల‌ని కోరారు.

ప‌లువురు మంత్రి విన్న‌పానికి స్పందించారు. తాము స‌హాయం చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని హామీ ఇచ్చారు. సాఫ్ట్ వేర్, వైర్ లెస్ టెక్నాల‌జీ , ప్రాసెస‌ర్ల తయారీలో పేరొందిన క్వాల్క‌మ్ కంపెనీ రెండో కేంద్రాన్ని హైద‌రాబాద్ లో స్థాపించేందుకు ముందుకొచ్చింది.

రూ. 3905 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంది. అడ్వెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ ఫార్మా సెక్టార్ లో రూ. 1750 కోట్లు ఇన్వెస్ట్ చేయ‌నుంది.

Also Read : క‌రెంట్ ఛార్జీల పెంపుపై ‘బండి’ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!