India Us Meet : భార‌త్..అమెరికా మ‌ధ్య చ‌ర్చ‌లు

ఏప్రిల్ 11న ముహూర్తం ఖ‌రారు

India Us Meet : ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో త‌ట‌స్థ వైఖ‌రిని అవలంభిస్తూ వ‌స్తున్న ఇండియాపై పెద్ద‌న్న అమెరికా క‌న్నెర్ర చేస్తోంది. ఈ త‌రుణంలో ఇరు దేశాల మ‌ధ్య కొంత దూరాన్ని త‌గ్గించేందుకు భార‌త దేశ విదేశాంగ మంత్రి జై శంక‌ర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ మేర‌కు భార‌త‌, అమెరికా (India Us Meet)దేశాల మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు ప్రారంభం కానున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారైంది. వ‌చ్చే ఏప్రిల్ 11న ఈ రెండు దేశాల మ‌ధ్య సంభాష‌ణ‌లు మొద‌ల‌వుతాయి.

ఉక్రెయిన్ యుద్దంపై ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డ‌డాన్ని అమెరికా నిర‌సిస్తూ వ‌స్తుంది. చైనా అనుస‌రిస్తున్న వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

అమెరికా విదేశాంగ‌, ర‌క్ష‌ణ శాఖ మంత్రుల‌తో భార‌త్ కు చెందిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు విదేశాంగ మంత్రి జై శంక‌ర్ హాజ‌రు కానున్నారు.

ఇరు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ‌, రాజ‌కీయ సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్టం చేసుకోవ‌డంతో పాటు ఉక్రెయిన్, ఇండో ప‌సిఫిక్ ఆందోళ‌న‌, త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా జో బైడెన్ వైట్ హౌస్ లో కొలువు తీరిన త‌ర్వాత భార‌త్, అమెరికా దేశాల మ‌ధ్య ప్ల‌స్ టూ ఫార్మాట్ ల‌లో ఇది మొద‌టి సంభాషణ కావ‌డం విశేషం.

అయితే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర‌ష్యా చీఫ పుతిన్ తో పాటు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీతో టెలి ఫోన్ లో సంభాషించారు. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. భార‌త్ యుద్దాన్ని కోరుకోవ‌డం లేద‌ని శాంతికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : క‌ర్ణాట‌క స‌ర్కార్ పై బీజేపీ నేత ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!