Jai Shankar : శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయింది. రోజు రోజుకు పరిస్థితులు దారునంగా ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు చెందిన ఓ జర్నలిస్ట్ జై శంకర్(Jai Shankar )కు చేసిన ట్వీట్ కు చలించి పోయారు.
శ్రీలంకలో రోదనలు మిన్నంటుతున్నాయి. యావత్ ప్రపంచం ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మానవతా దృక్ఫథంతో ఆ దేశానికి తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రధాన ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపి వేశారు. పలువురు వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక ఆస్పత్రి సంక్షోభంతో కలవరపడిన ఎస్. జై శంకర్ సహాయం చేయమంటూ భారత దేశ రాయబారిని కోరారు.
మందుల కొరత కారణంగా ఆపరేషన్లను నిలిపి వేసిన ఆస్పత్రికి హెల్ప్ చేయాలంటూ భారత హై కమిషనర్ ను ఆదేశించారు. ద్వీప దేశంలో భారీ ఆర్థిక సంక్షోభం మధ్య ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ తనను ఆందోళనకు గురి చేసిందని తెలిపారు జై శంకర్(Jai Shankar ).
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఔషధాల కొరత కారణంగా పెరడేనియా ఆస్పత్రిలో షెడ్యూల్ చేసిన ఆపరేషన్లు నిలిపి వేశారు.
అత్యవసర చికిత్సలు మాత్రమే జరుగుతున్నాయని న్యూస్ ఫస్ట్ జర్నలిస్ట్ ఆయుబోవన్ ఎకనామిక్ క్రైసిస్ ఎల్కే అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.
ఈ వార్తలను చూసి కలవర పడుతున్నా. హైకమిషనర్ బాగ్లేని సంప్రదించా. భారత దేశం ఎలా సహాయం చేయగలదో చర్చించమని అడుగుతున్నానని తెలిపారు.
శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్న జైశంకర్ హై కమిషనర్ గోపాల్ ను ఆదేశించారు.
Also Read : కేంద్రం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం