Abdhul Khader : వ్యవసాయ రంగంలో ఇన్నోవేటర్ గా పేరొందారు అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్. కర్ణాటకలోని ధార్వాడ్ కు చెందిన వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.
రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్ పద్మశ్రీ అవార్డు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
అబ్దుల్ ఖాదర్ చేసిన ఇన్నోవేషన్ గురించి పలుసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ సమయంలో నడుచుకుంటూ వచ్చిన నడకత్తిన్ ప్రధానికి అభివందనం చేశారు.
అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్ కు ప్రధాన మంత్రి మోదీ లేచి నమస్కరించారు. ఈ సందర్బంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత దేశం అంతటా చిన్న, సన్న కారు రైతులకు సహాయం చేసే 40కి పైగా ఆవిష్కరణలతో ఘనత పొందారు అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్(Abdhul Khader).
తాను సామాన్యమైన రైతునని చెప్పారు అబ్దుల్ ఖాదర్. అయతే త 35 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలపై తాను చేసిన పరిశోధనలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని చెప్పారు.
ఈ సందర్భంగా తన జాతికి దక్కిన గౌరవంగా, వ్యవసాయ రంగానికి లభించిన తోడ్పాటుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పద్మశ్రీ పురస్కారాన్ని దేశంలోని రైతులందరికీ అంకితం చేస్తున్నానని ప్రకటించారు అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్(Abdhul Khader).
ఇదిలా ఉండగా కర్ణాటకకు చెందిన సుబబన్న అయ్యప్పన్, కేశవమూర్తి , సిద్ద లింగయ్యకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
Also Read : 466 ఎన్జీఓల ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ ల రద్దు