Fawad Chaudhury : పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నారు. ఇప్పటికే స్పీకర్ అనుమతి కూడా ఇచ్చేశారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కు అనుంగు అనుచరుడిగా పేరొందారు, కేబినెట్ లోని మంత్రిగా పని చేస్తున్న ఫవాద్ చౌదరి(Fawad Chaudhury). ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
అవిశ్వాస తీర్మానంపై స్పందించారు. ఇవాళ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ మామూలోడు కాదని, ప్రత్యర్థులకు అందని చాతుర్యం, నైపుణ్యం, నాయకత్వం కలిగిన అరుదైన నాయకుడంటూ కితాబు ఇచ్చారు.
పాకిస్తాన్ పీఎం ఫ్లవర్ అనుకుంటే పొరపాటు అని ఆయన ఫైర్ ఉన్నోడంటూ పేర్కొన్నారు ఫవాద్ చౌదరి. ఇమ్రాన్ ఖాన్ ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే ముందు అద్భుతమైన ప్లేయర్.
ప్రపంచ క్రికెట్ లో తన బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించిన నాయకుడు. అంతే కాదు పాకిస్తాన్ కు వరల్డ్ కప్ తీసుకు వచ్చిన ఘనత కూడా ఆయనదే. సవాళ్లు ఆయనకు కొత్త కాదు.
బంతి ఇప్పటికీ ఆయన కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు ఫవాద్ చౌదరి. ఇమ్రాన్ ఖాన్ చివరి బంతి దాకా పోరాడతాడు. రాజీనామా చేసే ప్రసక్తి అంటూ ఉండదన్నాడు.
అయితే రసవత్తరమైన మ్యాచ్ మాత్రం తప్పక ఉంటుందన్నాడు. స్నేహితులే కాదు శత్రువులు కూడా ఈ మ్యాచ్ తప్పకుండా చూస్తారని తెలిపాడు ఫవాద్ చౌదరి.
Also Read : ఇమ్రాన్ నిర్ణయం జాతిని ఉద్దేశించి ప్రసంగం